Female Constable: వంద అనాథ శవాలకు అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-08-19T15:19:30+05:30 IST

గడిచిన ఐదేళ్ళలో దాదాపు వందకుపైగా అనాథ శవాలకు ఒక మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌(Female Police Constable) అంత్యక్రియలు నిర్వహించా

Female Constable: వంద అనాథ శవాలకు అంత్యక్రియలు

                            - మహిళా కానిస్టేబుల్‌కు డీజీపీ ప్రశంస


అడయార్‌(చెన్నై), ఆగస్టు 18: గడిచిన ఐదేళ్ళలో దాదాపు వందకుపైగా అనాథ శవాలకు ఒక మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌(Female Police Constable) అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu) ఆ కానిస్టేబుల్‌ ను తన కార్యాలయానికి పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళ్యానికి చెందిన అమీన కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈమె గత ఐదేళ్ళకాలంలో దాదాపు వందకు పైగా గుర్తు తెలియని అనాథ శవాలకు స్థానికంగా ఉన్న ఓ ఎన్‌.జి.వో సంస్థ సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ శైలేంద్రబాబు ఆ మహిళా కానిస్టేబుల్‌ను చెన్నై పిలిపించి ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా, ఆమెకు నగదు బహుమతి కూడా అందజేశారు. 

Updated Date - 2022-08-19T15:19:30+05:30 IST