నన్ను ఎవరూ అత్యాచారం చేయలేదు.. బలవంతంగా ఆ కేసు పెట్టించారు.. మహిళా ఎస్సై సంచలన ప్రకటన!

ABN , First Publish Date - 2022-02-21T20:11:25+05:30 IST

రాజస్థాన్‌లోని బిల్వారాలో కొన్ని రోజుల కిందట వెలుగు చూసిన అత్యాచార ఘటన సంచలనం రేకెత్తించింది.

నన్ను ఎవరూ అత్యాచారం చేయలేదు.. బలవంతంగా ఆ కేసు పెట్టించారు.. మహిళా ఎస్సై సంచలన ప్రకటన!

రాజస్థాన్‌లోని బిల్వారాలో కొన్ని రోజుల కిందట వెలుగు చూసిన అత్యాచార ఘటన సంచలనం రేకెత్తించింది. ఓ మహిళా ఎస్సైపై స్థానిక రాజకీయ నాయకులు అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక టీమ్‌ను కూడా ఏర్పరిచి విచారణ ప్రారంభించారు. అయితే బాధితురాలు యూటర్న్ తీసుకుంది. తనపై ఎవరూ అత్యాచారానికి పాల్పడలేదని చెప్పి షాక్ ఇచ్చింది. 


బిల్వారా జిల్లా ఏఎస్పీ, స్పెషల్ టీమ్ హెడ్ మైత్రేయి ముందు హాజరైన మహిళా ఎస్సై షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తనపై రాజకీయ నాయకులు అత్యాచారానికి పాల్పడ్డారనేది అవాస్తవమని, పై అధికారులు బలవంతంగా తన చేత కేసు పెట్టించారని ఆమె వాంగ్మూలం ఇచ్చింది. తనపై తన ఇంట్లోనే బీజేపీకి చెందిన భన్వర్ సింగ్, మరో 11 మంది వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని జనవరి 29న సదరు మహిళా ఎస్సై కేసు పెట్టింది. కేసు పెట్టిన రెండో రోజే ఆమె ఐజీ ముందుకు వెళ్లి తనపై ఎవరూ అత్యాచారానికి పాల్పడలేదని, ఏఎస్పీలు బలవంతంగా కేసు పెట్టించారని ఫిర్యాదు చేసింది. 


ఐజీ వెంటనే స్పందించి ఆ ఇద్దరు ఏఎస్పీలను సస్పెండ్ చేశారు. అలాగే ఈ కేసు విచారణ నిమిత్తం ఓ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం ఈ టీమ్ ముందు హాజరైన మహిళా ఎస్సై.. `నన్ను ఎవరూ అత్యాచారం చేయలేదు. నాకు ఎవరితోనూ విభేదాలు లేవు. కేసు వాపసు తీసుకోవాలని నన్ను ఎవరూ బెదిరించడం లేదు. ఏఎస్పీల ఒత్తిడి వల్లే నేను భన్వర్‌సింగ్‌పై కేసు పెట్టాన`ని మహిళా ఎస్సై చెప్పింది.  

Updated Date - 2022-02-21T20:11:25+05:30 IST