నివురుగప్పిన నివర్‌

ABN , First Publish Date - 2020-11-27T04:24:06+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌జిల్లా రైతాంగాన్ని, ప్రజలను నివర్‌ తుఫాను వణికిస్తోంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలపై తుఫాను ప్రభావం ఉండడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఆకాశం మేఘవృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ప్రజలను, రైతులను అప్రమత్తం చేస్తోంది.

నివురుగప్పిన నివర్‌
కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం రాశులు

ఉమ్మడి జిల్లాకు నివర్‌ తుఫాన్‌ ముప్పు
గురువారం కామారెడ్డిలో కురిసిన మోస్తరు వర్షం
కొనుగోలు కేంద్రాలలో భారీగా ఽధాన్యం నిల్వలు
వర్షం వస్తే తడిసి ముద్దవనున్న ధాన్యం
కేంద్రాలలో అందుబాటులో లేని టార్ఫాలిన్లు
ఇప్పటికే ఉభయ జిల్లాల్లో 7 లక్షల మెట్రిక్‌
టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు
మరో లక్షన్నర మెట్రిక్‌ టన్నుల ధాన్యం
కొనుగోలు అయ్యే అవకాశం
తీవ్ర ఆందోళనలో ఉమ్మడి జిల్లా రైతులు

కామారెడ్డి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిజామాబాద్‌జిల్లా రైతాంగాన్ని, ప్రజలను నివర్‌ తుఫాను వణికిస్తోంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలపై తుఫాను ప్రభావం ఉండడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఆకాశం మేఘవృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ప్రజలను, రైతులను అప్రమత్తం చేస్తోంది. ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నందున కేంద్రాలలోనే కుప్పలు తెప్పలుగా ధాన్యం నిలువలు ఉన్నా యి. తుఫానుతో అకాల వర్షం కురిస్తే రైతుల ధాన్యం తడవ కుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కానీ కేంద్రాలలో మాత్రం సహకార శాఖ సరిపడా టార్పాలి న్‌లను అందుబాటులో ఉంచలేదని రైతులు మండిపడుతు న్నారు. వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి ముద్దవుతుందేమోన ని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తుఫాన్‌ ప్రభావంతో కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం తడవకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రెండు జిల్లాల కలెక్టర్‌లు సంబ ంధిత శాఖ అధికారులు ఆదేశించారు.
7 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు 7 లక్షల మె ట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు అధికా రుల రికార్డులు చెబుతున్నాయి. రెండు జిల్లాల్లో ఇప్పటికే 70 శాతం వరకు ధాన్యం కొనుగోలు పూర్తయినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో 422 కొనుగోలు కేంద్రాల ద్వారా 80 వేల మంది రైతు ల నుంచి రూ. 850 కోట్ల విలువై న 4 లక్షల 50 వేల 408 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేపట్టారు. ఇందులో రూ.528 కోట్ల ధాన్యం డబ్బులను ఆయా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేశారు. జిల్లాలో ఈ వానాకా లం సీజన్‌లో 7లక్షల మెట్రిక్‌ టన్నుల ఽధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ లెక్కన మ రో 80 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేపట్టే అవ కాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా లో 341 కేంద్రాల నుంచి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించిన అధికారులు ఇప్పటి వర కు రూ.563 కోట్ల విలువచేసే 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 75,132 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో 62 వేల మంది రైతుల ఖాతాలో రూ.446 కోట్ల ధా న్యం డబ్బులను జమచేశారు.
తుఫాన్‌ భయంతో రైతుల ఉరుకులు పరుగులు
తుఫాన్‌ భయంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రైతులు ఉరుకులు, పరుగు లు పెడుతున్నారు. వరి కోతలు ఇప్పటికే పూర్తయ్యాయి. ధాన్యాన్ని రైతులు కొను గోలు కేంద్రాలకు తర లించారు. తేమ ఎ క్కువగా ఉండడం తో సన్నరకాలు కొనుగోలు చేయ డం లేదు. దీంతో రైతులు ఇళ్లు, రో డ్లు, పొలాలతో పా టు ఐకేపీ, పీఏసీ ఎస్‌ కేంద్రాలలో ఆర బెడుతున్నారు. వర్షం వస్తే ధాన్యం ఎక్కడ తడుస్తుందోనని రైతుల్లో ఆం దోళన నెలకొంది. అధికారులు తేమశాతం తక్కువగా ఉన్న ధాన్యా నికే కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్‌లు ఇస్తున్నారు. టార్పాలిన్‌లు లేకపోవడంతో ధాన్యం తడుస్తుందని, తడిసిన ధాన్యం కొనుగొలు చేస్తారో? లేదోన ని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ సహకార సం ఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్‌లు అందుబాటులోలేవు. ఇప్పటికే ఆయా కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి కుప్ప లుగా పోశారు. ఒకవేళ తుఫాను ప్రభావంతో వర్షం పడితే ధాన్యం తడుస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతుల తీవ్ర ఆందోళనకు గురై ధాన్యం తడవకుండా టార్పాలిన్‌లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వానాకాలంలోనూ భారీ వర్షాలు
ఈ వానాకాలంలో ఉమ్మడి జిల్లాలో వానలు దంచి కొట్టా యి. సెప్టెంబరు, అక్టోబరు మాసాలలో కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేల మంది రైతులకు చెంది న 21 వేల ఎకరాలకుపైగా వివిధ పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని 22 మండలాలోని 71 గ్రామాలలో 1,800 ఎకరాలలో వరి, 100 ఎకరాలలో సోయా పంటలు దెబ్బతిని సూమారు రూ.2కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లోని 316 గ్రామాలలో 19,313 ఎకరాలలో వివి ధ పంటలు దెబ్బతిని 19,169 మంది రైతులు రూ.8 కోట్ల వరకు నష్టపోయారు. వరి 9,863 ఎకరాలలో, పత్తి 9350 ఎకరాలలో, సోయాబీన్‌ 160 ఎకరాలు, చెరుకు 40 ఎకరాల లో దెబ్బతిన్నాయి. సరిగ్గా వానాకాలం సీజన్‌లో పండించిన పంటల ఉత్పత్తులను రైతులు అమ్ముకునే దశలో ఉండగా నివర్‌ తుఫాను కలవర పెడుతోంది. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యంతో పాటు సీసీఐ కేంద్రాలలో పత్తి, కల్లాలు రోడ్ల పై మొక్కజొన్న, పప్పుదినుసు పంటలు ఉన్నాయి. ఈ తు ఫాన్‌ ప్రభావంతో వర్షం కురిస్తే ఎక్కడ పంట ఉత్పత్తులు తడిసి మళ్లీ నష్టపోవాల్సి వస్తుందోనని ఉమ్మడి జిల్లా రైతు లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-11-27T04:24:06+05:30 IST