అరుదైన తాబేలు దొరికింది!

ABN , First Publish Date - 2021-06-05T05:19:52+05:30 IST

ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఫెర్నాన్‌డినా జెయింట్‌ తాబేలు మళ్లీ ప్రత్యక్షమయి- శాస్త్రవేత్తలను ఆనందంలో ముంచెత్తింది. అసలా తాబేలేమిటి? అది ఎక్కడ దొరికందనే విషయాన్ని తెలుసుకుందాం.

అరుదైన తాబేలు దొరికింది!

ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఫెర్నాన్‌డినా జెయింట్‌ తాబేలు మళ్లీ ప్రత్యక్షమయి- శాస్త్రవేత్తలను ఆనందంలో ముంచెత్తింది. అసలా తాబేలేమిటి? అది ఎక్కడ దొరికందనే విషయాన్ని తెలుసుకుందాం. 


పరిణామక్రమంలో జరిగిన అనేక పరిణామాలకు తాబేలు జాతి ప్రత్యక్ష సాక్షి అని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉంటారు. దానిని గమనిస్తే అనేక కొత్త విషయాలు తెలుస్తాయనేది వారి భావన. ప్రపంచంలో అనేక దేశాల్లో రకరకాల తాబేళ్లు నివసిస్తూ ఉన్నా- ఫెర్నాన్‌డినా తాబేలుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇది వందేళ్లకు పైగా జీవిస్తుంది. అంతే కాదు... దీని మెడ పొడవుగా ఉంటుంది. ఒకప్పుడు ఈ జాతి తాబేళ్లు అనేక ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవి. అయితే ఇవి క్రమంగా కనిపించకుండా పోయాయి. దీనితో ఈ జాతి అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు భావించారు.


ఫెర్నాన్‌డినా జెయింట్‌ తాబేలును 1906లో ఆఖరిసారి చూసినట్లు రికార్డుల్లో నమోదయింది. ఆ తర్వాత ఈ తాబేలును ఎవరూ చూడలేదు. అయితే 2019 చివరలో ఈక్విడార్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలాపెగాస్‌ ద్వీపంలో ఈ తాబేలు కనిపించింది. అయితే ఇది ఫెర్నాన్‌డినా తాబేలా? కాదా? అనే విషయం శాస్త్రవేత్తలకు తెలియలేదు. దీనితో డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్ష ఫలితాలు తాజాగా వచ్చాయి. ఈ పరీక్షల్లో 2019లో దొరికినది ఫెర్నాన్‌డినా తాబేలేనని తేలింది. 

Updated Date - 2021-06-05T05:19:52+05:30 IST