ఎరువు.. కరువు

ABN , First Publish Date - 2022-06-21T07:24:17+05:30 IST

వానాకాలం మొదలై పంటల విస్తీర్ణం పెరుగుతుండడంతో ఎరువులకు డిమాండ్‌ పెరిగింది. యూరియా వాడకం ఎక్కువైంది. ప్రతీరోజు రైతులు ఆరుతడి పంటలతో పాటు వరినాట్లను వేస్తుండడంతో ఎరువులను ఎక్కువ మొత్తంలో వినియోగిస్తుండడంతో జిల్లా అంతటా ఎరువు కరువవుతోంది.

ఎరువు.. కరువు
మార్కెట్లో ఎరువుల నిల్వలు ఇలా..

జిల్లాలో ఎరువులకు పెరుగుతున్న డిమాండ్‌

అంతటా విస్తారంగా వివిధ పంటల సాగు

యూరియానే అత్యధికంగా ఉపయోగిస్తున్న రైతులు

సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్‌, ఆగ్రోస్‌ వంటి సంస్థలతో పాటు డీలర్ల ద్వారా సరఫరా

జిల్లావ్యాప్తంగా ఈయేడు 5.9లక్షలకు పైగా ఎకరాల్లో పంటల సాగు అంచనా

నిజామాబాద్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వానాకాలం మొదలై పంటల విస్తీర్ణం పెరుగుతుండడంతో ఎరువులకు డిమాండ్‌ పెరిగింది. యూరియా వాడకం ఎక్కువైంది. ప్రతీరోజు రైతులు ఆరుతడి పంటలతో పాటు వరినాట్లను వేస్తుండడంతో ఎరువులను ఎక్కువ మొత్తంలో వినియోగిస్తుండడంతో జిల్లా అంతటా ఎరువు కరువవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులంతా పంటలు వేస్తుండడంతో వ్యవసాయ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎరువుల కొరత లేకుండా ప్రయత్నా లు చేస్తున్నారు. జిల్లాకు యూరియా నిల్వలు వచ్చేవిధంగా చూస్తున్నా రు. వచ్చిన ఎరువులను సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్‌, ఆగ్రోస్‌ సంస్థలతో పాటు డీలర్ల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్నారు.

పెరుగుతున్న వానాకాలం సాగు

జిల్లాలో వానాకాలం పంటల సాగు పెరుగుతోంది. వర్షాలు పడుతుండడంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. వరి నాట్లను సైతం ఇబ్బడిముబ్బడిగా మొదలుపెట్టారు. జిల్లాలో ఈ సంవత్సరం 5లక్షల 9వేల 750 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఈ పంటల్లో 79 శాతం వరకు వరి సాగవుతుందని అంచనా వేయగా.. మిగతా 21శాతం ఆరుతడి పంటలైన సోయా, మొక్కజొన్న, పసుపుతో పాటు ఇతర పంట లు వేస్తారని ప్రణాళికలు పొందుపర్చారు. ఈ పంటలకు అవసరమైన ఎరువుల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. జూన్‌ నుంచి సెప్టెంబ రు వరకు ఎరువుల వాడకం ఎక్కువగా ఉండనుండడంతో ముందస్తుగా నిల్వలు ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

4లక్షల ఎకరాలకు పైగా వరి

జిల్లాలో వరిపంట ప్రతీ సంవత్సరం అత్యధికంగా సాగు చేస్తున్నారు. వానాకాలంలో కూడా ఈ పంటనే ఎక్కు వగా వేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో కూడా నాలుగు లక్షల ఎకరాలకు పైగా సాగవుతుందని అంచనా వేశారు. జిల్లాల్లో ఏ పంట వేసినా రైతులు అత్యధికంగా యూరియానే వినియోగిస్తున్నారు. వానాకాలంలో ఎక్కువ మొత్తం ఈ ఎరువునే వేస్తున్నారు. మిగతా కాం ప్లెక్స్‌, ఇతర ఎరువులు ఉన్నా.. రైతులు వరి త్వరగా పెరగడంతో పాటు గింజ పోసుకునేందుకు ఎక్కువగా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో యూరియాను మూడు విడతల్లో వేస్తుండగా.. జిల్లాలో ఎక్కువమంది రైతులు నాలుగు విడతల్లో వేస్తున్నారు. వరి నాటువేసే సమయం నుంచి పొట్ట దశ వర కు నాలుగు సార్లు యూరియా వేస్తున్నారు. జిల్లాలో రైతుల నుంచి డిమాండ్‌ కూడా యూరియాకే ఎక్కువగా ఉంది. పంటల విస్తీర్ణం పెరిగే కొద్ది ప్రతీ సంవత్సరం యూరియా వినియోగం కూడా అవుతుంది. 

యూరియాకే రైతుల ప్రాధాన్యత

జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో దాదాపు సీజన్‌లో ఉపయోగించే మొత్తం యూరియాలో 75శాతం వరకు వినియోగిస్తున్నారు. ఈ సంవత్సరం వానాకాలంలో కూడా 87వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాకు 37వేల మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చింది. ఈ యూరియాలో 10వేల మెట్రిక్‌ టన్నులు ఇప్పటికే రైతులకు అందించారు. మిగతా యూరియాను కూడా సీజన్‌కు అనుగుణంగా వినియోగించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాకు వచ్చిన యూరియాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్‌, ఆగ్రోస్‌ వంటి సంస్థలతో పాటు ప్రైవేట్‌ డీలర్ల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్నారు. 

యూరియా నిల్వలపై దృష్టి

జిల్లాలో ప్రతీ సంవత్సరం జూన్‌ చివరి నాటికి 60 శాతానికి పైగా యూరియా నిల్వలు ఉండేవిధంగా వ్యవసాయ అధికారులు చూస్తున్నా రు. ఈ సీజన్‌లో కూడా అదే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతీరోజు జిల్లాకు మూడు వేల మెట్రిక్‌ టన్నుల యూరియా రైలు ద్వారా వస్తుంది. ఈ యూరియాలో వెయ్యి టన్నులు జిల్లాకు ఇస్తుండగా.. వెయ్యి టన్నుల చొప్పున కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాల కు కేటాయిస్తున్నారు. ఒకేసారి 50వేల మెట్రిక్‌ టన్నుల వరకు యూరియా నిల్వలను తెప్పిస్తే రైతులు సీజన్‌లో ఇబ్బందులు పడే అవకాశం తప్పుతుంది. వర్షాలు భారీగా పడితే రైతులు అందరూ వరినాట్లు మొదలుపెడతారు. ఆ సమయంలోనే ఎక్కువ మొత్తంలో యూరియాను వినియోగిస్తారు. ముందస్తుగానే యూరియాను తీసుకువచ్చి నిల్వ ఉంచి, నెలవారి కోటాలో భాగంగా రైతులకు సరఫరా చేయనుండడంతో ఇబ్బందు లు తప్పనున్నాయి. ఇతర జిల్లాల్లో ఆరుతడి పంటతో పాటు వరి సాగు చేస్తుండడం వల్ల యూరియాను తక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు.

దిగుబడుల కోసం వినియోగం

వ్యవసాయశాస్త్రవేత్తలు కూడా యూరి యా వినియోగాన్ని తగ్గించాలని కోరుతు న్నా.. అధిక దిగుబడుల కోసం ఎక్కువ మొత్తంలో రైతులు వేస్తున్నారు. నత్రజని సంబంధిత యూరియా వాడడం వల్ల భూమి లో సారం తగ్గుతుందని రైతులకు అవగాహన కల్పిస్తున్న వా డకం తగ్గించడం లేదు. సీజన్‌లో అవసరమయ్యే స్టాక్‌ను తె ప్పించకపోతే కీలక సమయంలో రైతులు ఆందోళనకు ది గుతున్నారు. ఈ వానాకాలం కూడా ముందే స్టాక్‌ తెప్పి స్తే తప్ప యూరియా అందే పరిస్థితి లేదు. జిల్లాలో యూ రియాతో పాటు ఈ సీజన్‌లో డీఏపీ 11500 మెట్రిక్‌ టన్ను లు, పొటాషియం 10వేల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరు వులు 35,800 మెట్రిక్‌ టన్నులు అవసరమని అంచనా వేశా రు. వీటిలో డీఏపీ ఇప్పటి వరకు ఎనిమిది వేల మెట్రిక్‌ టన్ను లు, పొటాస్‌ 1500, కాంప్లెక్స్‌ మూడు వేల మెట్రిక్‌ టన్నులు స్టాక్‌ ఉంచారు. అవసరం మేరకు రైతులకు సరఫరా చేస్తున్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం

: తిరుమల ప్రసాద్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నిజామాబాద్‌

రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువుల నిల్వలను ఉండేవిధంగా చూస్తున్నాం. డిమాండ్‌కు అనుగుణంగా ఎరువులను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా కోటాకు అనుగుణంగా ఎరువుల స్టాక్‌ ప్రతీరోజు జిల్లాకు వస్తోంది. రైతులు వరి సాగుకు యూరియాను తగిన మోతాదులోనే వాడాలని స్పష్టంగా పేర్కొంటున్నాం. అంతేకాకుండా యూరియా ఎక్కువ వాడిన ఉపయోగం ఉండదని స్పష్టం చేస్తున్నాం. 

Updated Date - 2022-06-21T07:24:17+05:30 IST