కులవృత్తి పోయిన వారికి పెన్షన్‌ సౌకర్యం

ABN , First Publish Date - 2020-11-30T04:51:53+05:30 IST

గాండ్ల, తెలికుల, దేవితిలకుల కులాల వెనుకబాటు తనాన్ని పోగొట్టేందుకు కృషి చేస్తానని రాష్ట్ర దేవతిలకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సంకిస భవానీప్రియ పేర్కొన్నారు.

కులవృత్తి పోయిన వారికి పెన్షన్‌ సౌకర్యం
సంకిస భవానీప్రియకు సత్కరిస్తున్న దృశ్యం

రాష్ట్ర దేవతిలకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ భవానీప్రియ

సిరిపురం, నవంబరు 29: గాండ్ల, తెలికుల, దేవితిలకుల కులాల వెనుకబాటు తనాన్ని పోగొట్టేందుకు కృషి చేస్తానని రాష్ట్ర దేవతిలకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సంకిస భవానీప్రియ పేర్కొన్నారు. విశాఖ అఖిలగాండ్ల, తెలికుల, దేవతికుల అభినందన కమిటీ నేతృత్వంలో భవానీప్రియకు ఆదివారం నగరంలోని ఒక హోటల్లో పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కులవృత్తి పోయిన వారికి పెన్షన్‌ సౌకర్యాలతో పాటు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అఖిలగాన తిరుమల ట్రస్ట్‌ చైర్మన్‌ దాడి సత్యనారాయణ, జిల్లా గాండ్ల తెలికుల అధ్యక్షుడు పెబ్బిలి రవికుమార్‌లు మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్‌ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం కార్యదర్శి పాలిశెట్టి సూరిఅప్పారావు, ఉయ్యూరివీర్రసాద్‌, ఉత్తరాంధ్ర జిల్లాల డైరెక్టర్లు చిత్రాడ కనక సూర్యపద్మావతి, కొమ్మనాపల్లి భాస్కరరావుప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-30T04:51:53+05:30 IST