జిల్లాలో 1456 మందికి జ్వరం

ABN , First Publish Date - 2021-05-07T06:30:06+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 1456 మందికి జ్వరం, జలు బు, దగ్గు, తదితర అనారోగ్యపరమైన లక్షణాలు ఉన్నట్లు మొదటి రోజు సర్వేలో గుర్తించినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు.

జిల్లాలో 1456 మందికి జ్వరం
వలిగొండలో ఇంటింటి సర్వేను పరిశీలిస్తున్న ఎంపీడీవో గీతారెడ్డి

మొదటిరోజు సర్వేలో గుర్తింపు  

మరో మూడు రోజులు సర్వే 

డీఎంహెచ్‌వో సాంబశివరావు 

భువనగిరి రూరల్‌, మే 6: జిల్లా వ్యాప్తంగా 1456 మందికి జ్వరం, జలు బు, దగ్గు, తదితర అనారోగ్యపరమైన లక్షణాలు ఉన్నట్లు మొదటి రోజు సర్వేలో గుర్తించినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు. కొవిడ్‌ వైరస్‌ కట్టడికి జ్వరంతో బాధపడుతున్నవారిని సర్వే చేయమని ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సర్వే కొనసాగింది. జిల్లాలో 421 గ్రామ పంచాయతీల్లో  1,66,876 ఇళ్లు ఉండగా, గురువారం ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది 625 బృందాలుగా పర్యటించి 35,293 ఇళ్లను సర్వే చేసినట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు.  ఈ సర్వేలో మొదటిరోజు  గుర్తిచిన 1456 మందిలో 338 మందికి  మెడికల్‌ కిట్లు అందజేస్తామన్నారు.  ఈ సర్వే మరో మూడు రోజుల పాటు కొనసాగ నున్నట్లు ఆయన తెలిపారు.  జిల్లాలోని ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, వైద్య ఆరోగ్య సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు. 

జ్వరాల సర్వేకి ప్రజలు సహకరించాలి  

భూదాన్‌పోచంపల్లి: కొవిడ్‌ బాధితులను గుర్తించేదుకు ప్రభుత్వం చేప ట్టిన జ్వరాల సర్వేకి ప్రజలు సహకరించాలని భూదాన్‌పోచంపల్లి మునిసి పల్‌ కమిషనర్‌  ఎన్నం సుదర్శన్‌ కోరారు. పట్టణంలో జ్వరాల సర్వేని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా సర్వేలో పాల్గొంటున్న మునిసిపల్‌, మెప్మా, ఆశా, అంగన్‌వాడీ సిబ్బందికి ఽథర్మా మీటర్లు, పల్స్‌ చెకింగ్‌ మీటర్లు, శానిటైజర్లు మాస్క్‌లు అందజేశారు. సర్వే చేయడానికి పట్టణంలోని 13 వార్డుల పరిధిలో 13 టీంలను నియమించి నట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజ యలక్ష్మీశ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామి, మునిసిపల్‌ మేనేజర్‌ రమేష్‌ పాల్గొన్నారు. 

మూడు రోజుల్లో సర్వేని పూర్తి చేయాలి

ఆత్మకూరు(ఎం): ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో చేపట్టిన జ్వరాల సర్వేని అధికారులు, సిబ్బంది మరో మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీడీవో ఏ.రాములు అధికారులను, సిబ్బందిని కోరారు. గురువారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో జ్వరాల సర్వేని ప్రారంభించి మాట్లాడారు. ఈ సర్వేలో జ్వరం ఉన్నవారిని సిబ్బంది గుర్తించి మందులు పంపిణీ చే స్తారని తెలిపారు. కార్య క్రమంలో  మండల ప్రత్యేక అధికారి శ్యాం సుందర్‌, డాక్టర్‌ ప్రణీష, పద్మావతి, కరుణాకర్‌ పాల్గొన్నారు.

పలు గ్రామాలలో ఇంటింటా సర్వే....

యాదాద్రి రూరల్‌/భువనగిరిరూరల్‌/వలిగొండ: యాదాద్రి మండలంలోని మాసాయిపేట, దాతరుపల్లి, గౌరాయిపల్లి గ్రామాల్లో ఆశాలు, ఏఎన్‌ ఎంలు ఇంటింటా సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు. భువనగిరి మండలంలో ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు  2850 ఇళ్లలో క్షేత్ర స్థాయిలో పర్యటించి జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్న వారిని గుర్తించినట్లు ఎంపీడీవో టి. నాగిరెడ్డి తెలిపారు. వలిగొండ, మండలంలో . 3,545 ఇళ్లను సర్వే చేశారు. అనా రోగ్యంతో ఉన్న 125 మందికి ్ల గుర్తించి 41 మందికి మెడికల్‌ కిట్లను అం దజేసినట్లు ఎంపీడీవో గీతారెడ్డి తెలిపారు. 

పకడ్బందీగా సర్వేను నిర్వహించాలి

చౌటుప్పల్‌ టౌన్‌: చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో ఇంటింటీ జ్వర సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు కో రారు. మునిసిపల్‌ కార్యాలయంలో  గురువారం ఆశా కార్యకర్తలు, ముని సిపల్‌ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. .ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఈ సర్వే ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. సమావేశంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ సత్యనారా యణ పాల్గొన్నారు.

కరోనాపై ఇంటింటి సర్వే

సంస్థాన్‌ నారాయణపురం/మోత్కూరు: మండల సంస్థాన్‌ నారాయణ పురం, మోత్కూరు మండలాల్లో గురువారం కరోనాపై ఇంటింటి సర్వే నిర్వ హించారు. కార్యక్రమంలో సంస్థాన్‌ నారాయణపురం మండల వైద్యాధికారి దీప్తి, సూపర్‌వైజర్‌ లక్ష్మి, గుజ్జ సర్పంచ్‌ మైల యాదవరెడ్డి, అంజలి పా ల్గొన్నారు. మోత్కూరులో సర్వే ఎలా నిర్వహించాలనే అంశంపై ముని సిపల్‌ కమిషనర్‌ షేక్‌ మహమూద్‌  మాట్లాడుతూ  సర్వేపై సిబ్బంది  నిర్ల క్ష్యంవహిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మేనేజర్‌ జె.ప్రభాకర్‌, బిల్‌ కలెక్టర్‌ సోమయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T06:30:06+05:30 IST