పేటలో ఫీవర్‌ సర్వే ప్రారంభం

Published: Fri, 21 Jan 2022 23:50:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పేటలో ఫీవర్‌ సర్వే ప్రారంభంపేటలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న పుర చైర్‌పర్సన్‌ గందె అనసూయ

- కార్యక్రమాన్ని పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు 


నారాయణపేట, జనవరి 21 : కరోనా మూడో దశ తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన ఇంటింట ఫీవర్‌ సర్వే మొదటిరోజు కొనసాగింది. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ఆశా, అంగన్‌వాడీ, పుర సిబ్బంది ఇంటిం టికి వెళ్లి ఫీవర్‌ సర్వేను చేపట్టారు. పట్ట ణంలోని 5వ వార్డులో జరిగిన సర్వేలో పుర చైర్‌పర్సన్‌ గందె అనసూయ పాల్గొని సర్వేను పరిశీలించి, మాట్లాడారు. సర్వే సిబ్బంది కాలనీల్లోని ప్రతీ ఇంటికి వెళ్లి ఫీవర్‌ ఉన్నవారిని గుర్తించి ఉచి తంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు బాలాజీ, మౌనేష్‌, ఇన్‌చార్జి పుర కమిషనర్‌ సందీప్‌, జడ్పీ డిప్యూటీ సీఈవో జ్యోతి, ఏఎన్‌ఎం రా మేశ్వరి, ఐకేపీ లక్ష్మీ, దేవరాజ్‌, ఆశా, అంగన్‌వాడీ వ ర్కర్లు మహేశ్వరి, రాధిక, కౌసల్య, వార్డు ప్రజలు పా ల్గొన్నారు. అదేవిధంగా, 2వ వార్డులో పుర ఇన్‌చార్జి కమిషనర్‌ సందీప్‌, కౌన్సిలర్‌ జొన్నల అనిత స్థాని కుల ఆరోగ్య సమస్యలను తెలుసుకొని ఫీవర్‌ లక్షణా లు ఉన్నవారికి కరోనా కిట్లను అందించారు. కార్యక్ర మంలో పుర సిబ్బంది శ్రీనివాస్‌, రాఘవేంద్ర, ఆశాలు శివమ్మ, లక్ష్మీ, అంగన్‌వాడీ టీచర్లు రాధిక, గీత పాల్గొ న్నారు. 8వ వార్డులో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరి గి ఫీవర్‌తో బాధపడుతున్న వారికి మెడిసిన్‌ కిట్‌తో పాటు, సిటిజన్స్‌కు బూస్టర్‌ డోస్‌ను ఇచ్చారు. కార్యక్ర మంలో కౌన్సిలర్‌ శిరీష, ఏఎన్‌ఎం రామేశ్వరి, ఆశా, అంగన్‌ వాడీ కార్యకర్తలు లక్ష్మీ, సునిత పాల్గొన్నారు. 

బూస్టర్‌ డోస్‌ వేయించుకున్న జడ్పీ చైర్‌పర్సన్‌ 

నారాయణపేట టౌన్‌ : కరోనా థర్డ్‌వేవ్‌లో భాగంగా జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ శుక్రవారం తన కార్యాలయం లో బూస్టర్‌ డోస్‌ వేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పైసా ఖర్చు లేకుండా ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి ఆరోగ్య సర్వే చేయించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. సర్వేలో కరోనా లక్షణాలు ఉంటే ప్రతి రోగికి మెడికల్‌ కిట్‌ను ఆరోగ్య శాఖ ఉచితంగా అందిస్తుందన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని ప్రతీ ఇల్లు, ప్రతీ వ్యక్తి కూడా ఫీవర్‌ సర్వేలో పాల్గొనే విధంగా చూడాలని, వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని ఆమె కోరారు. 

సింగారం(నారాయణపేట) : మండలంలోని సింగారంలో శుక్రవారం వైద్య సిబ్బంది ఫీవర్‌ సర్వే నిర్వహించారు. ఏఎన్‌ఎం తిరుపతమ్మ, సర్వేటీం స భ్యులు రాకేష్‌, అశోక్‌, తారమ్మ, పుష్ప పాల్గొన్నారు.

మక్తల్‌రూరల్‌ : మండలంలోని సంగంబండ గ్రామంలో నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేను శుక్రవారం మండల ప్రత్యేకాధికారి జాన్‌సుధాకర్‌, ఎంపీడీవో శ్రీధర్‌లు పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారి పేర్ల లిస్టు తయారుచేసి వైద్య సిబ్బందికి అందిస్తున్నారు. వారి వెంట వైద్యులు సిద్దప్ప, సర్పంచ్‌ రాజు, ఉప సర్పంచ్‌ కేశవరెడ్డి, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు ఉన్నారు.

ధన్వాడ : ధన్వాడతో పాటు, మండలంలోని కిష్టాపూర్‌, రాంకిష్టాయ్యపల్లి, కొండాపూర్‌, చర్లపల్లి, కంసాన్‌పల్లి, గోటూర్‌, మందిపల్లి గ్రామాల్లో శుక్ర వారం వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇం టింటికి వెళ్లి ఫీవర్‌ సర్వేను నిర్వహించారు. వైద్య సి బ్బంది కతలప్ప, ఆశమ్మ, శ్రీదేవి, సుమిత్ర, ఆశ వర్క ర్లు చంద్రకళ, విజయలక్ష్మీ, మాసమ్మ, నర్సింగమ్మ, అంజిలమణితో పాటు, పలువురు సర్వేలో పాల్గొన్నారు.

మరికల్‌ : మండల కేంద్రంతో పాటు, వివిధ గ్రామాల్లో శుక్రవారం ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే నిర్వ హిస్తున్నారు. రాకొండ గ్రామంలో సర్పంచ్‌ భాస్కర్‌, ఉపసర్పంచ్‌ రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్వే సిబ్బంది ఇంటింటి సర్వే చేశారు.  

మాగనూరు : మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మాగనూరుతో పాటు, ర్‌ గ్రామంలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది చేపట్టిన ఫీవర్‌ సర్వేను ఎంపీడీవో పరిశీలించారు. సర్వేలో ఆశా వర్కర్లు అనంతమ్మ, అం గన్‌వాడీ టీచర్లు శోభ, తులసి, జయమ్మ ఉన్నారు.

దామరగిద్ద : మండలంలో శుక్రవారం పీహెచ్‌సీ సిబ్బంది, ఆశా వర్కర్లు ఫీవర్‌ సర్వే నిర్వ హించారు. 30 గ్రామ పంచాయతీల్లో మొత్తం 1805 మందికి సర్వే చేయడం జరిగిందన్నారు. లక్షణాలున్న 39 మందికి కిట్లు అందించామని వారు వివరించారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ జమీల్‌హైమద్‌, పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీ సిబ్బంది ఉన్నారు. 

ఊట్కూర్‌ : మండలంలోని పులిమామిడి, ఊట్కూర్‌ పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించారు. జ్వరం, ఇతర రోగాలతో బాధపడుతున్న వారికి వైద్య సిబ్బంది మందులను అందించారు. పలువురికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఊట్కూర్‌లో జరిగిన సర్వేలో ఏ ఎన్‌ఎం శైలజ, చిన్నపొర్లలో దేవికారాణి, అంగన్‌ వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

కోస్గి : పట్టణంలోని 9వ వార్డులో వైద్య సిబ్బంది ఫీవర్‌ సర్వే నిర్వహించారు. సర్వేను మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కోడిగంటి అన్నపూర్ణ పరి శీలించారు. వార్డులో ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజలకు కొవిడ్‌ కిట్లను అందించి, సూచనలు చేశారు. సీజనల్‌ వ్యా ధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆశా కార్యకర్తలు, వార్డు ప్రజలు ఆమె వెంట ఉన్నారు. 

మద్దూర్‌ : మండలంలోని అప్పిరెడ్డిపల్లి, అచ్చంపల్లి గ్రామంలో శుక్రవారం వైద్యాధికారులు ఫీ వర్‌ సర్వే నిర్వహించారు. కరోనా లక్షణాలున్న వారిని పరీక్ష నిమిత్తం సమీప ఆసుపత్రులకు రెఫర్‌ చేశా రు. సర్వేను ఎంపీడీవో విజయలక్ష్మి పరిశీలించారు.

పేటలో ఫీవర్‌ సర్వే ప్రారంభంపేటలో బూస్టర్‌ డోస్‌ వేయించుకుంటున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.