Commissioner of Police: బెంగళూరులో ఐదు పీఎఫ్ఐ కార్యాలయాల సీజ్‌

ABN , First Publish Date - 2022-09-30T17:25:08+05:30 IST

రాజధాని బెంగళూరు నగరంలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)కు చెందిన మొత్తం ఐదు కార్యాలయాలను సీజ్‌ చేశామని నగర పోలీస్‌

Commissioner of Police: బెంగళూరులో ఐదు పీఎఫ్ఐ కార్యాలయాల సీజ్‌

- నిషేధిత సంస్థకు ఎవరు మద్దతునిచ్చినా కఠిన చర్యలు 

- హోం శాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర హెచ్చరిక


బెంగళూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు నగరంలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)కు చెందిన మొత్తం ఐదు కార్యాలయాలను సీజ్‌ చేశామని నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రతాప్‌రెడ్డి(Pratap Reddy) వెల్లడించారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్థకు చెందిన జేసీనగర, హైగ్రౌండ్స్‌, హలసూరుగేట్‌, హెబ్బాళ, శివాజీనగర్‌ శాఖలు, పశ్చిమ విభాగం పరిధిలోని నాలుగు కార్యాలయాలు, ఈస్ట్‌ విభాగంలో ఒక కార్యాలయాన్ని సీజ్‌ చేశామన్నారు. పీఎ్‌ఫఐ సంస్థ ఆస్తులను సీజ్‌చేసుకునే దిశలో చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆరగజ్ఞానేంద్ర(Minister Aragyanendra) నగరంలో మీడియాకు చెప్పారు. ఈ సంస్థకు మద్దతుగా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పీఎఫ్ఐ పేరుతో ఇకపై ఎవరూ ఎలాంటి కార్యకలాపాలు జరిపేందుకు వీల్లేదని, ఈ మేరకు పోలీసులు గట్టి నిఘా విధిస్తారని చెప్పారు. పీఎఫ్ఐపై నిషేధం నేపథ్యంలో ఎక్కడా అ వాంఛనీయ ఘటనలు జరగలేదని, ముందు జాగ్రత్తగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు, కేఎస్ఆర్పీ దళాలను రంగంలోకి దించామన్నారు. పీఎఫ్ఐ నిషేధాన్ని అనేక ముస్లిం సంస్థలు సైతం స్వాగతించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టేవారంతా సంఘ విద్రోహులేనని, అలాంటి వారి విషయంలో సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఆర్‌ఎస్ఎస్‏ను పీఎఫ్ఐతో పోల్చడం మానసిక బలహీనత అని ఆయన కాంగ్రెస్‌ నేతలపై మండిపడ్డారు. పరారీలో ఉన్న బెళగావి జిల్లా పీఎఫ్ఐ అధ్యక్షుడు నవీద్‌కటగి కోసం గాలింపు జరుపుతున్నామని మంత్రి వెల్లడించారు. మహారాష్ట్ర లేదా గోవాకు ఇతను పరారై ఉండవచ్చునన్న అనుమానంతో గాలింపు కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు. 

Updated Date - 2022-09-30T17:25:08+05:30 IST