నిన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌.. నేడు చిరు వ్యాపారి

ABN , First Publish Date - 2020-11-30T03:54:20+05:30 IST

నిన్నటి దాకా మేజర్‌ గ్రామ పంచాయతీకి చెం దిన కూలీలకు ఉపాధి కల్పించిన ఆయన, అందరి నోళ్లలో నానాడు.

నిన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌.. నేడు చిరు వ్యాపారి
నవాబ్‌పేట సంతలో కూరగాయలు అమ్ముతున్న శ్రీనివాస్‌

నవాబ్‌పేట, నవంబరు 29 : నిన్నటి దాకా మేజర్‌ గ్రామ పంచాయతీకి చెం దిన కూలీలకు ఉపాధి కల్పించిన ఆయన, అందరి నోళ్లలో నానాడు. ఇప్పుడు ఉద్యోగం కోల్పోయి వేరే ఉపాధి లేక చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. 

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం ఇప్పటూరు గ్రామానికి చెం దిన శ్రీనివాస్‌ ఆ గ్రామ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేసేవాడు. ఈ ఏడాది మార్చి లో ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించడంతో శ్రీనవాస్‌కు ఉపాధి లేకుండా పోయింది. కుటుంబ పోషణ కూడా భారమైంది. 

దీంతో మండలంలో జరిగే సంతలలో తిరుగుతూ టమాటాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం నవాబ్‌పేటలో జరిగిన సంత లో కూరగాయలు అమ్ముకుంటూ ‘ఆంధ్రజ్యోతి’ కనిపించగా, ఆయన్ను పలుక రించింది. తప్పనిసరి పరిస్థితుల్లో బతకడం కోసం కూరగాయలు అమ్ముకుం టున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2020-11-30T03:54:20+05:30 IST