‘అన్నమయ్య’ బాధితుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన

ABN , First Publish Date - 2022-10-08T04:42:21+05:30 IST

అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితుల సమస్యలపై హైకోర్టు న్యాయవాది రాజగోపా ల్‌ శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బాధితుల కు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదంటూ హైకోర్టు లో బీజేపీ వేసిన వ్యాజ్యంపై ఈయన వాదనలు కొనసాగిస్తున్నారు.

‘అన్నమయ్య’ బాధితుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన
అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలిస్తున్న హైకోర్టు న్యాయవాది రాజగోపాల్‌

రాజంపేట, అక్టోబరు 7: అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితుల సమస్యలపై హైకోర్టు న్యాయవాది రాజగోపా ల్‌ శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బాధితుల కు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదంటూ హైకోర్టు లో బీజేపీ వేసిన వ్యాజ్యంపై ఈయన వాదనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే న్యాయవాది బీజేపీ నేతలతో కలిసి ప్రాజెక్టును పరిశీలించి ప్రాజెక్టు తెగిపోవడానికి గల కారణాలను ఆరా తీశారు. అనం తరం పులపత్తూరు, మందపల్లె, తొగూరుపేట, గుండ్లూరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ప్రాజెక్టు తెగిపోయి 11 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టించలేదని, పూర్తి స్థాయి నష్టపరిహారం కూడా ఇవ్వలేదని, పంట పొలాల్లో ఇసుకను తొలగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కరెంటు పునఃరుద్ధరించలేదని న్యాయవాది దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా న్యాయ వాది మాట్లాడుతూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీ లించానని, బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు శక్తివంచన లేకుండా న్యాయస్థానంలో పోరాడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, కార్యవర్గ సభ్యులు పోతు గుంట రమేష్‌నాయుడు, పట్టుపోగుల ఆదినారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T04:42:21+05:30 IST