Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

Published: Wed, 19 Jan 2022 12:10:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ అంటేనే అద్భుతమైన కట్టడాలు, బీచులు, స్కైలైన్స్‌తో ఎంతో సుందరంగా కనుల విందుగా ఉంటుంది. దీంతో విదేశాల నుంచి చాలామంది విహారయాత్రల కోసం దుబాయ్ వెళ్తుంటారు. కొన్ని రోజులు అక్కడ హాయిగా సేదతీరి వస్తుంటారు. ఇక ఈ సుందర మనోహర నగరంలో లభించే ప్రత్యేక ఆహార పదర్థాలు కూడా సందర్శకుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ జాబితాలో అక్కడి ఖరీదైన ఆహార పదర్థాలతో పాటు చాలా చీప్‌గా దొరికే ఫుడ్స్ కూడా ఉంటాయి. తక్కువ ధరకు దొరుకుతాయని వాటిని చీప్‌గా తీసివేయాల్సిన అవసరం లేదు. వాటిని ఒకసారి రుచి చూస్తే టేస్ట్‌లో బెస్ట్ అనాల్సిందేనట. అలా దుబాయ్‌లో చాలా చీప్‌గా దొరికే రుచికరమైన 15 ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

1. షావర్మా..

దుబాయ్ వెళ్లిన వారు తప్పకుండా అల్ మల్లాహ్ ప్రాంతంలో దొరికే చికెన్ షావర్మా రుచి చూడాల్సిందే. దుబాయ్‌లోనే ఇక్కడ దొరికే షావర్మాకు ప్రత్యేక గుర్తింపు ఉందటే ఇది ఎంత ఫేమసో ఇట్టే తెలిసిపోతుంది. దీని ధర కూడా కేవలం 9 దిర్హమ్స్(రూ.182) మాత్రమే. అల్ మల్లాహ్‌కు ఈ షావర్మా వల్ల ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అక్కడి నివాసితులు చెప్పే మాట. దుబాయ్ నగర వ్యాప్తంగా మూడు బ్రాంచీల్లో మాత్రమే ఈ షావర్మా దొరుకుతుంది. 

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

2. రిగాగ్..

ఇది మన దగ్గరి పుతరేకులను పోలి ఉండే ఆహార పదార్థం. పొరపొరలుగా ఉండే దీన్ని చీజ్, గుడ్డు, తేనెతో పాటు ఇతర వాటిని పేస్టులుగా వాడి తయారు చేయడం జరుగుతుంది. దుబాయ్‌లో చాలా చోట్ల రిగాగ్ లభిస్తుంది. కానీ, అల్ లబీబ్  గ్రోసరీలో లభించే రిగాగ్ చాలా ఫేమస్. దీని ధర కేవలం 5 దిర్హమ్స్‌(రూ.101) మాత్రమే. 

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

3. బన్ మస్కా అండ్ మసాలా టీ..

మన దగ్గర టీలో నంజుకుని తినే బన్ మాదిరిగానే దుబాయ్‌లో కూడా బన్ మస్కా చాలా పాపులర్. సంబూసా హౌస్‌లో దొరకుతుంది. మీనా బజార్ ప్రాంతంలోని సంబూసా హౌస్‌లో 2.50 దిర్హమ్స్‌కు(రూ.50) దొరికే బన్ మస్కా చాలా టేస్టీగా ఉంటుందట. దీన్ని 2 దిర్హమ్స్‌కు(రూ.40) లభించే మసాలా టీలో నంజుకుని తింటే ఆ టేస్టే వేరు. 

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

4. చికెన్ డంప్లింగ్స్ (మోమోస్)..

దుబాయ్ నివాసితులు సాయంకాలం వేళ ఎక్కువగా తినే స్నాక్స్ ఈ చికెన్ డంప్లింగ్స్ (మోమోస్). అక్కడి చైనీస్ కిచెన్‌లలో దొరికే మోమోస్‌ను దుబాయ్ వాసులు ఎక్కువగా ఇష్టపడతారు. 32 దిర్హమ్స్‌కు(రూ.650) లభించే ఈ చిరుతిళ్లను క్రమంగా తప్పకుండా అక్కడి రెసిడెంట్స్ రుచి చూస్తుంటారట. ఒక మనిషి 12 కంటే ఎక్కువ డంప్లింగ్స్ తినలేడు. అందుకే వీటిని తెప్పించుకుంటే షేరింగ్ తప్పనిసరి అని అక్కడి వారు చెబుతున్నమాట. 

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

5. ఇండియన్ థాలీ..

దుబాయ్‌లో భారతీయ ప్రవాసులు అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. దాంతో అక్కడి చాలా రెస్టారెంట్స్, హోటళ్లలో మన భారతీయ వంటకాలు దర్శనమిస్తుంటాయి. ఇలాగే వచ్చింది ఇండియన్ థాలీ. ఇక థాలీ అంటే ప్లేట్ అని అర్థం. ఓ పెద్ద థాలీలో వివిధ రకాల భారతీయ వంటకాలను భారీ మొత్తంలో ఉంచడం జరుగుతుంది. దుబాయ్‌లోని క్లేపాట్‌లో దొరికే ఇండియన్ థాలీ తింటే విందు భోజనం చేసిన అనుభూతి కలుగుతుందట. ఇందులో వేజ్, నాన్‌వేజ్ అని రెండు రకాలు ఉన్నాయి. వేజ్ థాలీ వెల 27 దిర్హమ్స్(రూ.548) అయితే, నాన్‌వేజ్ థాలీ ధర 37 దిర్హమ్స్(రూ.752). బుర్ దుబాయ్‌లోని సిటీ మ్యాక్స్ హోటల్‌లోని ఇండియన్ థాలీ చాలా ఫేమస్. 

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

6. ఫలాఫెల్స్..

దుబాయ్‌లో దొరికే స్నాక్స్‌లో ఫలాఫెల్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. హదూత మస్రేయాలో లభించే ఫలాఫెల్స్‌ బాగా ఫేమస్. ఒక ప్లేట్‌లో ఎనిమిది వస్తాయి. వీటి ధర 18 దిర్హమ్స్(రూ.365).

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

7. మసాలా దోస..

మన దగ్గర బ్రేక్‌ఫాస్ట్‌లో మనవాళ్లు మసాలా దోసను ఎంత ఇష్టంగా తింటారో.. దుబాయ్‌లో కూడా చాలా మంది మసాలా దోసను అంతే ఇష్టంగా ఆరగిస్తుంటారని తెలుస్తోంది. అక్కడి భారతీయ రెస్టారెంట్స్ అయిన ఆర్యాస్, సంగీతా, శ్రావణ భవన్‌లో మసాలా దోస దొరుకుతుంది. దీని ధర 6.50 దిర్హమ్స్(రూ.132). ఇక శ్రావణ భవన్‌లోని మసాలా దోస ధర కొంచెం ఎక్కువ. 12 దిర్హమ్స్(రూ.243) అవుతుంది. కానీ, రుచి పరంగా చూస్తే ఈ దోస ది బెస్ట్ అంటారు అక్కడి వాళ్లు. 

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

8. గహ్వా అండ్ డేట్స్..

మన దగ్గర ఎలాగైతే ఎవరైనా అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు మొదట చాయ్, బిస్కెట్ ఎలా ఆఫర్ చేస్తామో అచ్చం అలాగే యూఏఈలో గహ్వా, డేట్స్ ఇస్తారట. ఇంకా చెప్పాలంటే యూఏఈలో ఇదో సాంప్రదాయ స్వాగత పానీయం అన్నమాట. స్ట్రాంగ్ అరబిక్ కాఫీతో పాటు కొన్ని ఖర్జూర పండ్లను ఇస్తారు. అదే గహ్వా అండ్ డేట్స్. అల్ ఫహిదిలోని కాఫీ మ్యూజియంకు వెళ్తే అందరూ తప్పకుండా అక్కడ రుచి చూసేది గహ్వానే. 

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

9. ఎగ్ మసాలా..

దుబాయ్‌లో దొరికే చీప్ అండ్ బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఎగ్ మసాలా. మన దగ్గర హాఫ్ బాయిల్డ్ అమ్లేట్ అంటాం కదా. అచ్చం అలాగే ఉంటది ఎగ్ మసాలా. ఉల్లిగడ్డ, గ్రీన్ చిల్లి, అల్లంవెల్లులి, టమటాలతో ఎగ్ అమ్లేట్ అన్నమాట. దీనికి బాంబే పావ్(బన్) అదనంగా ఇస్తారు. దుబాయ్‌లోని రాజు అమ్లేట్ పాయింట్‌లో దొరికే ఎగ్ మసాలను ఒకసారి అయిన రుచి చూడాలంటారు అక్కడి నివాసితులు. దీని ధర 10 దిర్హమ్స్(రూ.203).

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

10. ఒమన్ చిప్స్..

మన దగ్గర ఎలాగైతే వివిధ రకాల చిప్స్ దొరుకుతాయో. అలాగే దుబాయ్‌లో దొరికే ఒమన్ చిప్స్ చాలా ఫేమస్. దుబాయ్‌లోని ఏ సూపర్ మార్కెట్‌లోనైనా దొరుకుతాయి. ఒమన్ చిప్స్ ధర కేవలం 1 దిర్హమ్స్‌(రూ.20) మాత్రమే.  

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

11. మనీష్/మనకిష్..

ఇది దుబాయ్ రెసిడెంట్స్ ప్రతిరోజు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్. సౌదీ బ్రేడ్ మధ్యలో అక్కావి చీజ్‌ను ఉంచి దీన్ని తయారు చేస్తారు. దుబాయ్‌లోని మమా ఈష్ అనే పాలస్తీనా రెస్టారెంట్ దీనికి చాలా ఫేమస్. ఈ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసేవారికి ఉచిత వైఫై సదుపాయం ఉంది. అలాగే ఉచితంగా మినరల్ వాటర్ కూడా ఇస్తారట. ఇక్కడ దొరికే మనకిష్ ధర వచ్చేసి 33 దిర్హమ్స్(రూ.670). ఇదే ధరలో మనకిష్‌తో పాటు టీ కూడా ఇస్తారు.  

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

12. కునాఫా విత్ క్రీమ్/చీజ్..

దుబాయ్‌లో దొరికే అద్భుతమైన ఫుడ్స్‌లో ఇది ఒకటి. సాధారణంగా అరబిక్ చీజ్ లేదా క్రీమ్‌తో నిండిన ఈ రుచికరమైన వంటకాన్ని ఫిరాస్ స్వీట్స్, జబల్ అల్ నూర్ వారు తయారు చేస్తారు. 15 దిర్హమ్స్‌కు(రూ.304)కు దొరుకుతుంది. దుబాయ్ వెళ్తే తప్పకుండా రుచి చూడాల్సిన వంటకాల్లో ఇది ఒకటి.

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

13. లుకైమత్..

ఇది సాంప్రదాయ ఎమిరటీ వంటకం. స్వీట్ డిష్. మన దగ్గర దొరికే రసగుల్లాలను పోలి ఉంటుంది. అక్కడి పురాతన ఎమిరాటీ రెస్టారెంట్ అయిన అరేబియన్ టీ హౌస్‌‌ ఈ లుకైమత్‌కు చాలా ఫేమస్. వీటి ఒక బాక్స్ ధర 28 దిర్హమ్స్(రూ.569).

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

14. బాంబే టోస్ట్..

ఇది ఫ్రెంచ్ టోస్ట్‌ మాదిరిగా ఉండే భారతీయ వంటకం. చాలా రుచికరంగా, చౌకగా ఉంటుంది. ఇది సత్వా, దీరాలోని వీధి కేఫ్‌లలో 10 దిర్హామ్స్(రూ.2.3) కంటే తక్కువ ధరకు దొరుకుతుంది.   

Dubai లో చాలా చీప్‌గా దొరికే 15 ఫుడ్స్.. టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అనాల్సిందే!

15. కరక్ చాయ్..

మన దగ్గర టీ మాదిరిగానే దుబాయ్‌లో కరక్ చాయ్. అక్కడి స్థానికులతో పాటు ప్రవాసులు చాలా మంది ఎంతో ఇష్టంగా తీసుకునే పానీయం. దీనికి అక్కడి కొన్ని ప్రాంతాలు చాలా పాపులర్. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.