ఆండ్రాయిడ్‌ ఫోన్‌ పదిహేను జాగ్రత్తలు

ABN , First Publish Date - 2021-03-13T05:47:56+05:30 IST

ప్రపంచంలోని హ్యాకర్లు, స్కామర్లు, ప్రకటనదారులను విపరీతంగా ఆకట్టుకునేది ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ అంటే అతిశయోక్తి కాదు. ఇందులోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అలాంటిది. మాల్వేర్‌కు తోడు ప్రకటనలతో గందరగోళ పరిచే లెక్కలేనన్ని యాప్‌లు ఉంటాయి

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ పదిహేను జాగ్రత్తలు

ప్రపంచంలోని హ్యాకర్లు, స్కామర్లు, ప్రకటనదారులను విపరీతంగా ఆకట్టుకునేది ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ అంటే అతిశయోక్తి కాదు. ఇందులోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అలాంటిది. మాల్వేర్‌కు తోడు ప్రకటనలతో గందరగోళ పరిచే లెక్కలేనన్ని యాప్‌లు ఉంటాయి. ఫలితంగా మొదట ఫోన్‌ వేగం తగ్గుతుంది. తరవాత మొత్తం ఫంక్షనింగ్‌ దెబ్బతినే అవకాశం ఉంది. వీటికి తోడు వినియోగదారుడి లొకేషన్‌ను ట్రాక్‌ చేసే స్పై యాప్‌లు సరేసరి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ వినియోగదారులు సాధారణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. 


స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌

ఫోన్‌ను అన్‌లాక్‌ చేసేందుకు ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ అన్‌లాక్‌ చాలా సౌలభ్యంగా కనిపిస్తాయి. అయితే నాలుగు అంకెలకు మించి ఉండే పాస్‌వర్డ్‌ని స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ అనొచ్చు. ఫేస్‌ అన్‌లాక్‌, ఫింగర్‌ ప్రింట్‌, ప్యాట్రన్‌, కోడ్‌ వంటి వాటిని చాలా సులువుగా ఛేదించవచ్చు. అదే స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ను పెట్టుకుంటే ఓపెన్‌ చేయడం చాలా కష్టమవుతుంది. క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్‌, నెంబర్స్‌, సింబల్స్‌ కలగలిపి ఉంటే ఛేదించడం కష్టం అవుతుంది. 


ఇన్‌బిల్ట్‌ యాంటీ వైరస్‌ యాప్‌ వద్దు

మాల్వేర్‌, స్పైవేర్‌, యాడ్వేర్‌ వంటి పలు యాప్‌లు హానికరమని అందరికీ తెలుసు. అయితే కొద్దిమంది ఆండ్రాయిడ్‌ వినియోగదారులు మాత్రమే పెయిడ్‌ యాంటీ వైరస్‌ లేదా మాల్‌ ప్రొటెక్షన్‌ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అలా కొన్నవి మాత్రమే ఎదురయ్యే ప్రమాదాల నుంచి కాపాడతాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని ఇన్‌బిల్ట్‌ యాప్‌నకు ప్రమాదాలను డిటెక్ట్‌ చేసే సామర్థ్యం లేదని గుర్తించండి. మాల్వేర్‌, స్పైవేర్‌, యాడ్వేర్‌ వంటి పలు యాప్‌లు హానికరమని అందరికీ తెలుసు. అయితే కొద్దిమంది ఆండ్రాయిడ్‌ వినియోగదారులు మాత్రమే పెయిడ్‌ యాంటీ వైరస్‌ లేదా మాల్‌ ప్రొటెక్షన్‌ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అలా కొన్నవి మాత్రమే ఎదురయ్యే ప్రమాదాల నుంచి కాపాడతాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని ఇన్‌బిల్ట్‌ యాప్‌నకు ప్రమాదాలను డిటెక్ట్‌ చేసే సామర్థ్యం లేదని గుర్తించండి. 


థర్డ్‌ పార్టీ యాప్‌లు వద్దు

ఆండ్రాయిడ్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే తెలియని సోర్సుల నుంచి యాప్‌లు ప్రత్యక్షమవుతాయి. అందుకని దానిని టర్న్‌ఆఫ్‌ చేయండి. పైపెచ్చు, అలా చేయకుంటే నేరుగా గూగుల్‌ ప్లే నుంచి వచ్చే యాప్‌లను కూడా అవి అడ్డుకుంటాయి. గూగుల్‌ యాప్‌ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే ఉత్తమం.


అప్డేట్‌ చేయాలి

సెక్యూరిటీ లేదంటే ఆండ్రాయిడ్‌ అప్డేట్‌ వెర్షన్‌లు ఫోన్‌కు వస్తుంటాయి. వాటిని వెంటనే అప్డేట్‌ చేసుకోవాలి. అంతే తప్ప నిర్లక్ష్యం చేయకూడదు. అప్డేట్‌ అయ్యేందుకు సమయం తీసుకున్నప్పటికీ తప్పదు. ఎందుకంటే హ్యాకింగ్‌ సృష్టిలో, సులువుగా మోసపోయే మార్గాల నుంచి చొరబడటంలోనూ మాల్వేర్‌ క్రియేటర్లు మహా జోరుగా ఉంటారని తెలుసుకోవాలి. 


ఎపికె ఫైల్స్‌

ఎపికె ఫైల్స్‌ ఎలా పనిచేస్తాయన్న అవగాహన లేనప్పుడు ప్లే స్టోర్‌ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే ఉత్తమం. చాలా యాప్‌లు గూగుల్‌లో లభ్యం కావు. అలాంటప్పుడు ఎపికె ఫైల్‌ను డౌన్‌లోడు చేసుకుని దాని నుంచి ఆ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఉత్తమం. అయితే ఎపికె ఫైల్‌తోనూ కొన్ని రిస్క్‌లు ఉంటాయి. కాకపోతే కొంత బెటర్‌. ఎపికెని గూగుల్‌ గుర్తించడం లేదు.


షరతులు తెలుసుకోవాలి

ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ముందు దానికి నిర్దేశించిన షరతులు, నిబంధనలు, అనుమతులు వంటివన్నీ చదవడాన్ని అలవాటు చేసుకోవడం చాలా మంచిది. అనుమతులు పరిమితికి మించితే ప్రశ్నించాలి.  ఉదాహరణకు వాల్‌ పేపర్‌ యాప్‌ మీ కాంటాక్ట్‌ నంబర్లు, ఎంఐసి అడగదు. అయితే మీ గ్యాలరీ యాక్సె్‌సను అడగవచ్చు. ఇలాంటివి ఎందుకు, ఏమిటి అన్నది తెలుసుకోవాలి. 


తస్కరణకు వీలు లేకుండా...

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ సులువుగా దొంగల పాలుపడకుండా ఉండాలంటే గూగుల్‌కు చెందిన ‘ఫైండ్‌ డివై్‌స’తో వెంటనే కనెక్ట్‌ కావాలి. సెట్టింగ్స్‌ను మార్పు చేసి స్ర్కీన్‌ లాక్‌ భద్రంగా ఉండేలా చూసుకోవాలి. దాంతో పాస్‌వర్డ్‌ లేకుండా అందులో మొబైల్‌ డేటాను టర్న్‌ఆఫ్‌ లేదా ఫోన్‌ని స్విచ్చాఫ్‌ చేయడం కుదరదు. 


ర్యాండమ్‌ అడాప్టర్లు వద్దు

ఫోన్‌ ఛార్జింగ్‌ కోసం అత్యున్నత నాణ్యత కలిగిన అడాప్టర్లను మాత్రమే ఉపయోగించాలి. 5,000 ఎఎంహెచ్‌కు తక్కువ కాని బ్యాటరీలే ఇప్పుడు మొబైల్స్‌లో ఉంటున్నాయి. అలాంటి వాటికి ఏవో ర్యాండమ్‌ అడాప్టర్లతో ఛార్జింగ్‌ మంచి పని కాదు.


పర్సనల్‌ డేటాకు బ్యాకప్‌

ఫోన్‌ పోవచ్చు, బ్రేక్‌ కావచ్చు. అలాంటప్పుడు కొత్త ఫోన్‌ కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు మీ పర్సనల్‌ డేటా మాటేమిటి. అందుకోసం బ్యాకప్‌ వెసులుబాటు తప్పనిసరి. లేకుంటే యావత్తు డేటా సేకరణ చాలా కష్టం.


డౌన్‌లోడ్‌ యాప్‌ చెక్‌

సెట్టింగ్స్‌లోకి వెళ్ళి డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌లను చెక్‌ చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఐకాన్‌ లేని స్పైవేర్‌ యాప్‌లు ఉంటాయి. ఫోన్‌ ఇన్‌సైడ్‌లో దాగి ఉంటాయి. చెక్‌ చేసుకుంటేనే అన్‌నోన్‌ యాప్‌లను పట్టుకోగలుగుతారు.


ఉపయోగించని యాప్‌లు తొలగించాలి

ఒక యాప్‌ను ఉపయోగించని పక్షంలో దానిని డిలీట్‌ చేయడం చాలా మంచిది. ఔట్‌ డేటెడ్‌ యాప్‌లను కూడా డిలీట్‌ చేయాలి. ఆ పని చేయకుండా వాటిని అలాగే ఉంచుకుంటే అనవసరంగా మెమరీలో స్పేస్‌ తినేస్తాయి. పైపెచ్చు మాల్వేర్‌ ఇన్ఫెక్షన్‌కూ అవకాశం ఇచ్చినట్లవుతుంది. 


తరచూ పాస్‌వర్డ్‌ చేంజ్‌

గూగుల్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ను తరచూ మారుస్తూ ఉండాలి. ప్రైవసీ దెబ్బతిన్నప్పుడు అదే మిమ్మల్ని రక్షిస్తుంది. 


క్లియరింగ్‌ క్యాచే

యాప్‌లలో క్యాచే మెమరీని ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే ఫోన్‌లో వేగం పెరుగుతుంది. 


బ్లోట్‌వేర్‌ను తప్పించండి

ఆండ్రాయిడ్‌ కొత్తఫోన్‌తో బ్లోట్‌వేర్‌ కూడా వస్తుంది. బ్లోట్‌వేర్‌ నిజానికి అనవసరమైన ఫీచర్‌. అత్యంత ఎక్కువ స్పేస్‌ను తినేస్తుంది. దాన్ని అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. లేకుంటే అతి త్వరలోనే కొత్త ఫోన్‌ కొనుగోలు చేయాల్సి వస్తుంది.  


రోజూ రీస్టార్ట్‌

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ని రోజుకు ఒకసారి రీస్టార్ట్‌ చేయడమే మంచిది. కనీసం అకేషనల్‌గా అయినా చేయాలి. లేకుంటే ఫోన్‌ పనిచేయడంలో వేగం తగ్గుతుంది. ముఖ్యంగా ఒటిపి నంబర్లు లేదంటే మెసేజ్‌లు వెనువెంటనే రావు.

Read more