పోటీ 80కి 20కి మధ్యే: యోగి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-10T17:22:07+05:30 IST

పోరాటం 80 కి 20 కి మధ్యే జరగబోతోంది. అభివృద్ధి, సుపరిపాలన కోరుకునే 80 శాతం ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. అలాగే గూండాలు, మాఫియాను సమర్ధిస్తూ రైతుల్ని వ్యతిరేకించే, అభివృద్ధిని ఇష్టపడని 20 శాతం ప్రజలు ప్రజలు ప్రతిపక్షాల వైపు ఉన్నారు..

పోటీ 80కి 20కి మధ్యే: యోగి వివాదాస్పద వ్యాఖ్యలు

లఖ్‌నవూ: 80 శాతం 20 శాతం అంటూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రజలను విడదీస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ అభివృద్ధి, ఉత్తమ పాలన కోరుకునే 80 శాతం ప్రజలు భారతీయ జనతా పార్టీవైపు ఉన్నారని అన్న యోగి.. రైతు వ్యతిరేకులు, అభివృద్ధి వ్యతిరేకులు, గూండాలు, మాఫియాలైన 20 శాతం విపక్షంలో ఉన్నారని అన్నారు.


‘‘పోరాటం 80 కి 20 కి మధ్యే జరగబోతోంది. అభివృద్ధి, సుపరిపాలన కోరుకునే 80 శాతం ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. అలాగే గూండాలు, మాఫియాను సమర్ధిస్తూ రైతుల్ని వ్యతిరేకించే, అభివృద్ధిని ఇష్టపడని 20 శాతం ప్రజలు ప్రజలు ప్రతిపక్షాల వైపు ఉన్నారు’’ అని యోగి అన్నారు.


అయితే ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల జనాభా శాతం 20 శాతానికి దగ్గరగా ఉంటుంది. అలాగే యూపీలో హిందువుల జనాభా 80 శాతానికి దగ్గరగా ఉంది. ముస్లింలు లక్ష్యంగానే యోగి ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శలు వస్తున్నాయి. గతంలో యోగి అనేక సార్లు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. హిందూ, ముస్లింలుగా ఉత్తరప్రదేశ్ ప్రజలను విడదీసి ఎన్నికల్లో లబ్ది పొందాలని యోగి యోచిస్తున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2022-01-10T17:22:07+05:30 IST