రైతు వేదిక శంకుస్థాపనలో రసాభాస... అధికారులు, దళితుల వాగ్వాదం

ABN , First Publish Date - 2020-08-07T17:24:57+05:30 IST

మహదేవపూర్‌ మండలంలోని సూరారం గ్రామంలో గురువారం జరిగిన రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాల శంకుస్థాపన రసాభాసగా మారింది. సూరారం శివారులోని 281, 280, 279 సర్వే నెంబర్లలో ఉన్న భూముల్లో

రైతు వేదిక శంకుస్థాపనలో రసాభాస... అధికారులు, దళితుల వాగ్వాదం

తహసీల్దార్‌, ఎస్సై డౌన్‌.. డౌన్‌.. అంటూ నిరసన


మహదేవపూర్‌ రూరల్‌ (ఆంధ్రజ్యోతి): మహదేవపూర్‌ మండలంలోని సూరారం గ్రామంలో గురువారం జరిగిన రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాల శంకుస్థాపన రసాభాసగా మారింది. సూరారం శివారులోని 281, 280, 279 సర్వే నెంబర్లలో ఉన్న భూముల్లో దళితులు తాత్కాలికంగా గుడిసెలు వేసుకోగా అధికారులు రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాల నిర్మా ణం కోసం కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 30ఏళ్ల క్రితం సూరారం శివారులో ఉన్న అటవీ భూమిని అప్పటి స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు 40మంది దళితులకు ఇళ్ల నిర్మాణాల కోసం పంపిణీ చేశారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు ఇళ్లు నిర్మించుకోక పోవడం తో ఆ భూముల్లో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు చేపట్టాల ని అధికారులు, పంచాయతీ పాలకవర్గం కలిసి నిర్ణయించారు. ఇది తెలుసుకున్న దళితులు తహసీల్దార్‌, ఎస్సై, డీఎల్‌పీవోలకు దండం పెడు తూ తమ భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ వేడుకున్నారు. అధికారులు పట్టించుకోక పోవడంతో దళితులు ఆందోళనకు దిగారు.


శంకుస్థాపన పనులను అడ్డుకుని ఎస్సై, తహసీల్దార్‌, డీఎల్‌పీవో డౌన్‌ డౌన్‌ అంటూ నిరసన వ్యక్తం చేశారు. తమ భూమిలో ప్రభుత్వ నిర్మా ణాలను విరమించుకునే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ బైఠాయించారు. దీంతో అధికారులు వెనుదిరగడంతో గొడవ సద్దుమణిగింది. అప్పటి స్పీ కర్‌ శ్రీపాదరావు దళితులకు ఇచ్చిన భూ జాబితాలో ఉన్న ప్రతీ ఒక్కరికి భూమి కేటాయించిన తర్వాతే మిగతా భూమిలో రైతు వేదిక, పల్లె ప్రకృ తి వనాలు నిర్మించాలని దళితులు కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరికి ఇదో ఉదాహరణ అంటూ జడ్పీటీసీ గుడాల అరుణ మండిపడ్డారు. దళితులకు న్యాయం జరిగే వరకు నిరసనలు చేపడతామని తెలిపారు.

Updated Date - 2020-08-07T17:24:57+05:30 IST