Viral Video: వివాహ వేదికపైనే వధూవరుల ఫైటింగ్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!

ABN , First Publish Date - 2022-08-09T14:09:03+05:30 IST

వివాహం తర్వాత జీవితం గురించి రకరకాల జోక్‌లు, సెటైర్లు తరచుగా వింటూ ఉంటాం.

Viral Video: వివాహ వేదికపైనే వధూవరుల ఫైటింగ్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!

వివాహం తర్వాత జీవితం గురించి రకరకాల జోక్‌లు, సెటైర్లు తరచుగా వింటూ ఉంటాం. వైవాహిక జీవితంలోని కష్టనష్టాల గురించి, భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవల గురించి కూడా జోక్‌లు పేలుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) వివాహ వేదికపైనే వధూవరులు గొడవ పడ్డారు. వివాహ వేదికపైనే వధూవరులు తీవ్రంగా కొట్టుకుంటున్న (Bride and Groom fight) వీడియో నెట్టింట్ల చక్కర్లు కొడుతోంది.   


ఇది కూడా చదవండి..

Boyfriend of the Year: చెట్టు కింద ఏకాంతంగా కూర్చున్న ప్రేమ జంట.. ప్రియుడు ఏం చేస్తున్నాడో చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే..!


ఆ వీడియోలో.. వధువు తన చేతిని కోపంగా వరుడి వైపు తీసుకెళ్లగా.. అతడు ఆమెను అడ్డుకున్నాడు. దీంతో ఆమె మరింత ఆగ్రహానికి గురైంది. ఇద్దరూ చేతులతో ఒకరిని మరొకరు తోసుకున్నారు. ఆ తర్వాత వధువు వరుడిని కిందకు తోసేసి అతనిపై పడిపోయింది. వెనుక ఉన్న వారు ఆపుతున్నా వారు ఆగలేదు. అయితే వారి గొడవకు కారణమేంటనేది తెలియలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

Updated Date - 2022-08-09T14:09:03+05:30 IST