మామిడిపల్లిలో తగాదా.. ఇరువర్గాలపై కేసు

ABN , First Publish Date - 2021-01-17T05:26:37+05:30 IST

మామిడిపల్లి తగాదాలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్టు సాలూరు రూరల్‌ ఎస్‌ఐ పి.దినకర్‌ శనివారం తెలిపా రు.

మామిడిపల్లిలో తగాదా.. ఇరువర్గాలపై కేసు

సాలూరు రూరల్‌, జనవరి 16: మామిడిపల్లి తగాదాలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్టు సాలూరు రూరల్‌ ఎస్‌ఐ పి.దినకర్‌ శనివారం తెలిపా రు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం... మామిడిపల్లి గ్రామంలోని బక్కుపేట కాలనీకి చెందిన మువ్వల జయరాం అనే వ్యక్తి చీటీ డబ్బులు బాకీ ఉన్నట్టు అదే గ్రామానికి చెందిన పోలిరోతు మంగ పోలీ సులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 14న చీటీ డబ్బులను అడిగేందుకు జయరాం ఇంటికి వెళ్లగా దౌర్జన్యం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అదేరోజు సాయంత్రం ఇంటి మీద దాడి చేసి, సామాన్లు చిందరవందర చేశారని, తన ఆడపడుచు జయ, ఆమె భర్త వెంకట చలపతితో పాటు తనను జయరాం, నాగరాజు, ప్రకాష్‌, పరశురాం, పండు అనే వ్యక్తులు కొట్టారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. ఇదిలా ఉండగా పోలీసులు తనకు న్యాయం చేయాలంటూ శనివారం మధ్యాహ్నం నుంచి పోలిరోతు మంగ సాలూరు తహసీ ల్దార్‌ కార్యాలయ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు.

కుల దూషణపై కేసు  

పోలిరోతు మంగ చీటీ బాకీ డబ్బులు తీర్చాలంటూ తన మరిది జయరాంపై, తనపై దాడిచేసి, కులంపేరుతో దూషించిందని మువ్వల కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 14న తన మరిది మువ్వల జయరాంతో కలిసి గుడికి వెళ్తుండగా మంగ దాడి చేసి, కులం పేరుతో దూషించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ పి.దినకర్‌ చెప్పారు. 

 

Updated Date - 2021-01-17T05:26:37+05:30 IST