కంబిరిగాం రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం

ABN , First Publish Date - 2022-05-15T05:20:01+05:30 IST

కంబిరిగాం భూములకు సంబంధించి రైతులకు న్యాయం జరిగే వరకూ సీపీఐ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం కంబిరిగాంలో రైతులతో ఆయన మాట్లాడారు.

కంబిరిగాం రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు

 సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు
పలాస రూరల్‌:
కంబిరిగాం భూములకు సంబంధించి రైతులకు న్యాయం జరిగే వరకూ సీపీఐ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం కంబిరిగాంలో  రైతులతో ఆయన మాట్లాడారు. రానున్న ఖరీఫ్‌లో కంబిరిగాం భూముల్లో రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం చేస్తామని, బినామీ పేరుతో భూముల అమ్మకాలు, కొనుగోలు చేసినా ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకుడు గూన సింహాచలం, సీపీఐ నాయకులు చాపర వెంకట రమణ, చాపర వేణుగోపాల్‌, ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రవి పాల్గొన్నారు.

‘చింతలగార భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోండి’
టెక్కలి:
చింతలగార భూ ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శనివారం చింతలగార గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ అక్రమాలపై సీఎంకు చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో భూ పోరాట కమిటీ నాయకులు షణ్ముఖరావు, యడ్ల గోపి, సత్యం, ప్రభుదేవ, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Read more