పోరాట ఫలితమే మత్స్యకారులకు పరిహారం

ABN , First Publish Date - 2022-01-22T06:17:52+05:30 IST

యానాం నియోజకవర్గంలో చమురు సంస్థల కార్యకలాపాలతో నష్టపోతున్న మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని 2011లో 103 రోజులు పాటు చేసిన పోరాట ఫలితంగానే రూ.16.38కోట్లు భారీ పరిహారం విడుదల అయిందని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు.

పోరాట ఫలితమే మత్స్యకారులకు పరిహారం

ఫతన వల్లేనని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదం

ఫ తనపై పోటీకి సిద్ధమా?

ఫ ఎమ్మెల్యే గొల్లపల్లికి  మల్లాడి సవాల్‌

యానాం, జనవరి 21: యానాం నియోజకవర్గంలో చమురు సంస్థల కార్యకలాపాలతో నష్టపోతున్న మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని 2011లో 103 రోజులు పాటు చేసిన పోరాట ఫలితంగానే రూ.16.38కోట్లు భారీ పరిహారం విడుదల అయిందని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. అంతేగాని ఎమ్మెల్యే అయిన  9నెలల కాలంలో చేసిన కృషి ఫలితంగానే నిధులు విడుదల అయ్యాయని స్థానిక ఎమ్మెల్యే చెప్పడం హస్యాస్పదం అన్నారు. నష్టపరిహారం విడుదలైన సందర్భంగా శుక్రవారం పుదుచ్చేరి సీఎం ఎన్‌.రంగసామి, మల్లాడి కృష్ణారావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి అనంతరం మల్లాడిని భారీ గజమాలలతో సత్కరించారు. ఈసందర్భంగా మల్లాడి మాట్లాడుతూ  ఫేక్‌న్యూస్‌లతో ప్రజలను తప్పదోవపట్టిస్తే ఉరుకునేదిలేదని, చెయ్యనిదానిని చేసినట్టు చెప్పుడుకోవడం కంటే, చేసింది చెప్పుకుంటే ప్రజలు హర్షిస్తారన్నారు. గడిచిన యానాం ఎన్నికల్లో ఎవ్వరిపై గెలిచావో తెలుసుకుంటే మంచిదని, తరుచూ మల్లాడిపై గెలిచానని చెప్పడం సరికాదన్నారు. ఇప్పుడు నాపై పోటీకి సిద్ధమా అని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌అశోక్‌కు మల్లాడి సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యేగా తనపై విజయం సాధించపోయినా గొల్లపల్లి అశోక్‌ యానాంలో ఉన్నా లేక పోయినా  పర్వాలేదని, కాని నా సేవలను ప్రజలు తిరస్కరించి ఎన్నికల్లో నేను ఓడిపోతే మళ్లీ తాను యానాంలో అడు గు పెట్టనని మల్లాడి పేర్కొన్నారు. ఈచాలెంజ్‌కు ఎమ్మెల్యే సిద్ధమేనా అని మల్లాడి సవాల్‌ విసిరారు.



Updated Date - 2022-01-22T06:17:52+05:30 IST