మృత్యువుతో పసివాడి పోరాటం

ABN , First Publish Date - 2021-06-24T09:16:07+05:30 IST

పాపం.. ఓ పసివాడికి పెద్ద సమస్య వచ్చింది. కొవిడ్‌ నుంచి కుటుంబ సభ్యులందరూ కోలుకున్నా.. ఆ బాలుడికి మళ్లీ జ్వరం వచ్చింది

మృత్యువుతో పసివాడి పోరాటం

కొవిడ్‌ తగ్గాక మెదడులో గడ్డకట్టిన రక్తం 

ఇల్లు, పొలం తాకట్టు పెట్టి 15 లక్షలు ఖర్చు

వైద్యానికి ఇంకా రూ.20 లక్షలు అవసరం

సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు 


ముద్దనూరు, జూన్‌ 23: పాపం.. ఓ పసివాడికి పెద్ద సమస్య వచ్చింది. కొవిడ్‌ నుంచి కుటుంబ సభ్యులందరూ కోలుకున్నా.. ఆ బాలుడికి మళ్లీ జ్వరం వచ్చింది. మెదడులో రక్తం గడ్డకట్టింది. తల్లిదండ్రులు ఇల్లు, పొలాన్ని రూ.15 లక్షలకు తాకట్టుపెట్టి వైద్యం చేయించారు. నయం కావాలంటే మరో 20 లక్షలు కావాలి. ప్రస్తుతం ఆ బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. దాతలు ఆర్థిక సాయం అందించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కడప జిల్లా ముద్దనూరు మండలం మాదన్నగారిపల్లెకు చెందిన శారద, మారుతి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. అందరూ గత నెల 27న కరోనా బారినపడి కోలుకున్నారు. వీరి పదేళ్ల కొడుకు హర్షవర్ధన్‌ నాయుడుకు మళ్లీ జ్వరం వచ్చింది. చికిత్స కోసం తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు హైదరాబాద్‌ లేదా బెంగళూరు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఆ చిన్నారి పదిరోజులుగా చికిత్సపొందుతున్నాడు. ఇల్లు, నాలుగెకరాల పొలం తాకట్టు పెట్టి వైద్యం చేయించారు. చిన్నారి కోలుకోవాలంటే మరో రూ.20 లక్షలు అవసరం అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆర్థిక సాయం అందించి తమ బిడ్డను కాపాడాలని దాతలను వేడుకుంటున్నారు. సాయం చేయదలచినవారు బ్యాంక్‌ అకౌంట్‌ నంబరు 32102210009987, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌:ఎ్‌సవైఎన్‌బీ 0003210 లేదా ఫోన్‌పే, గూగుల్‌ పే నంబరు:9966004297కు పంపాలని కోరారు. 

Updated Date - 2021-06-24T09:16:07+05:30 IST