
కడప: రాయలసీమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం కడప కేంద్రంగా పోరుబాట పడతామని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రకటించారు. సీమ ప్రాంత రైతాంగ సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. అరాచకాలు, అక్రమాలు తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయిస్తున్నా అభివృద్ధి పనులను చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి