తగాదాలను గ్రామస్థాయిలోనే పరిష్కరించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-24T05:12:17+05:30 IST

చిన్న చిన్న తగాదాలను పోలీస్‌స్టేషన్‌ వరకు తీసుకవెళ్లకుం డా గ్రామస్థాయిలోనే పరిష్కరించుకోవాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగేశ్వర్‌ అన్నారు.

తగాదాలను గ్రామస్థాయిలోనే పరిష్కరించుకోవాలి
న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న నాగేశ్వర్‌

- బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగేశ్వర్‌

- పెద్దగూడెంలో న్యాయ విజ్ఞాన సదస్సు

వనపర్తి రూరల్‌, అక్టోబరు 23: చిన్న చిన్న తగాదాలను పోలీస్‌స్టేషన్‌ వరకు తీసుకవెళ్లకుం డా గ్రామస్థాయిలోనే పరిష్కరించుకోవాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగేశ్వర్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని పెద్దగూడెం గ్రా మంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పా టి తగాదాలకు పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకొని కోర్టుల చుట్టు తిరుగుతున్నారన్నారు. అప్పులు తీసుకొనేటప్పుడు ఎట్టి పరిస్థి తుల్లో తెల్ల పేపర్లపై సంతకాలు చేయరాదన్నారు. అన్నదమ్ముల భూ వివాదాలు గ్రామ పెద్దల స మక్షంలో పరిష్కరించుకోవాలని, పోలీస్‌ స్టేషన్‌ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగితే పరిష్కారం అయ్యే వరకు ఆలస్యం అవుతుందని అన్నారు.  టూవీలర్‌లపై త్రిబుల్‌ రైడింగ్‌ చేయరాదని,  హెల్మెట్‌ ధరించాలని సూచించారు. తెలిసి తెలి యక తప్పు చేసినప్పుడు అది గ్రామస్థాయిలో ప రిష్కరించుకొని ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు పెంచుకొనే విధంగా ఉండాలన్నారు. కార్యక్రమం లో న్యాయవాదులు  తిరుపతయ్య, భూషన్‌, శివన్న, విష్ణువర్ధన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ కొండన్న, ఉప సర్పంచ్‌ భాస్కర్‌గౌడ్‌, గ్రామస్థులు, అంగన్‌వాడీ టీచర్లు  పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T05:12:17+05:30 IST