వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేయండి: సీఎస్‌

ABN , First Publish Date - 2021-07-25T07:59:15+05:30 IST

వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగ ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఆ శాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని...

వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేయండి: సీఎస్‌

వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగ ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఆ శాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడం, ప్రభుత్వాస్పత్రుల్లోని అన్ని పడకలను ఆక్సిజన్‌ బెడ్‌లుగా మార్పు చేయడం, పీడియాట్రిక్‌ ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్‌ల సంఖ్యను పెంచడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. మందుల కొరత రాకుండా చూసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. కొత్తగా మంజూరైన ఏడు  వైద్య కళాశాలల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు.


Updated Date - 2021-07-25T07:59:15+05:30 IST