సినీ తారల సోషల్‌ టాక్‌!

May 7 2021 @ 23:59PM

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన చాలలాంది నాయకానాయుకలు తమ గురించి ఆసక్తికర విషయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. 

1. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థ్యాంక్‌ యు’ చిత్రం సెట్‌లో నాగ చైతన్యతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది నాయిక రాశీఖన్నా. ఇటీవల ఇటలీలో ఈ చిత్రం షెడ్యూల్‌ ముగిసింది. 


2. సమాజానికి నచ్చినట్టు కాదు మీకు నచ్చినట్లు ఉండండి అని హితవు పలుకుతోంది నటి రాయ్‌ లక్ష్మీ. దీనితో పాటు తన ఫొటోషూట్‌ను షేర్‌ చేసింది. 


3. తను పెంచుకుంటున్న పప్పీతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది రాజశేఖర్‌ తనయ శివాత్మిక. తన స్నేహితురాలు ఈషా రెబ్బ ఈ ఫొటో తీశారు. 


4. 1990ల్లో తన తాతయ్య అడివి గంగరాజుకి దొరికిన తామ్రపత్రాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు అడివి శేష్‌. 


5. అనుపమా రోజుకో కొత్త ఫొటోతో అభిమానుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది, తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో కర్లీ హెయిర్‌తో క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో కెమెరాకు ఫోజ్‌ ఇచ్చిందీ మల్లూ బ్యూటీ. 


6. ట్రెడీషనల్‌ వేర్‌లో తన క్యూట్‌ పప్పీతో ఫొటోకు ఫోజ్‌ ఇచ్చారు తెలుగమ్మాయి ఈషా రెబ్బ. ఈ ఫొటోను శివాని తీశారు. 


7. మనమంతా స్టార్‌డస్ట్‌తో తయారయ్యాం అంటున్నారు కేథరిన్‌. 


8. ఆశ, విశ్వాసం, శాంతి, ప్రేమ, నమ్మకం.. నా జీవితంలో వెలుగులు నింపే కీలకమైప ఐదు అంశాలివి అంటున్నారు అనసూయ భరద్వాజ్‌. 

















Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.