హర్షాలీ టీనేజ్‌... అనుష్క విషెస్‌!

Jun 4 2021 @ 23:16PM

సినీ సెలబ్రిటీల సోషల్‌ టాక్‌! 

1. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో స్పందించే అనుష్కాశెట్టి శుక్రవారం తన సోదరుడికి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సోదరికి నీలాంటి బెస్ట్‌ బ్రదర్‌ ఉండాలి అని ఆమె పేర్కొన్నారు. 


2. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో మనమంతా ఒకటిగా ఉండి, ఒకరికొకరం సాయం చేసుకోవాలని రష్మిక మందన్నా కోరారు. కొవిడ్‌ కేర్‌ కిట్‌ ఉచితంగా అందిస్తోన్న ఽ‘దని’ యాప్‌ గురించి సమాచారం అందించారు. .


3. బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తనకు ఎంతో ఇష్టమైన వీడియోలో ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దీనిలో తన ముద్దుల మేనల్లుడు ఏడుస్తూ కనిపించాడు.


4. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘భజరంగీ భాయిజాన్‌’ చిత్రంలో మున్నీగా నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది హర్షాలీ మల్హోత్రా. 2021 జూన్‌ 3న 13వ వసంతంలోకి అడుగుపెట్టింది. టీనేజీలో అడుగుపెట్టాను అని ఇన్‌స్టా వేదికగా సంతోషం వ్యక్తం చేశారామె! 


5. తన పెంపుడు పిల్లితో ఆడుకుంది అనుపమ పరమేశ్వరన్‌. దాంతో కలిసి దిగిన ఫొటోని అభిమానులకు చూపిస్తూ.. ఒక పిల్లి మరో పిల్లిని లీడ్‌ చేస్తోంది అని రాసుకొచ్చింది. 


6. మాళవిక శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాని అనుసరిస్తోన్న వారి సంఖ్య 1 మిలియన్‌కి చేరింది. 


7. ముళ్లు తగలకుండా గులాబీని పొందలేం అంటోంది రాయ్‌లక్ష్మీ. 
























Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.