ఫిల్మ్‌ ఇండస్ట్రీ: వ్యాక్సిన్‌ ఎంతమంది తీసుకున్నారు?

May 6 2021 @ 19:19PM

కరోనా సెకెండ్‌ వేవ్‌ ప్రారంభానికి కొన్ని నెలల ముందే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ సైడ్‌ ఎఫెక్స్ట్‌ ఉంటున్నాయనే నెగిటివ్‌ ప్రచారం జరగడంతో చాలామంది వాక్సిన్‌ తీసుకోవడానికి వెనకడుగు వేశారు. ఇప్పుడు వాక్సిన్‌ తప్పనిసరి అనే సరికి అందరూ క్యూ కడుతున్నారు. ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో కోవిషీల్డ్‌ ఒకటే అందుబాటు ఉంది. కోవాగ్జిన్‌కి మరింత డిమాండ్‌ పెరగడంతో ఏ ఆసుపత్రిలోనూ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ‘వ్యాక్సిన్‌ తీసుకోండి.. ప్రాణాలు రక్షించుకోండి’ అంటూ తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది నటులు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ ఉపయోగాలను వివరిస్తూ సందేశాలను కూడా సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. అయితే చిత్ర పరిశ్రమ నుంచి ఎంతమంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు? సలహాలు మాత్రమే ఇచ్చారా.  సలహాల్ని పాటించారా? అన్నదానిపై ఓ లుక్కేద్దాం.

సీసీసీ పేరుతో పేద సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించిన చిరంజీవి ఇటీవల సినీ కార్మికులకు, సినీ జర్నలిస్ట్‌లకు అపోలో సౌజన్యంతో వాక్సిన్‌ అందజేసే ఏర్పాటు చేస్తామని, ఇదంతా రిజిస్ట్రేషన్ ప్రకారం జరుగుతుందని చిరంజీవి తెలిపారు. ఆయన కూడా తన కుటుంబ సభ్యులతో వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు పీఆర్‌ టీమ్‌ వెల్లడించింది. అక్కినేని నాగార్జున కూడా వ్యాక్సిన్‌ మార్చి 17న వాక్సిన్‌ తీసుకున్నట్లు ట్విట్టర్‌లో ఫొటో షేర్‌ చేశారు. ఇలాంటి విషయాల్లో వెంకటేశ్‌, బాలకృష్ణ కూడా ముందు జాగ్రత్తతోనే వ్యవహరిస్తారు. మోహన్‌బాబు ‘‘నేను వ్యాక్సిన్‌ తీసుకున్నా మరి మీరు? తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోండి’ అని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

తర్వాతి తరం హీరోల విషయానికొస్తే.. పవన్‌కల్యాణ్‌ కరోనా బారిన పడి చికిత్స పొందుతూ కోలుకున్నారు. మహేశ్‌, నమ్రతా ఇటీవల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అల్లు అర్జున్‌కు కరోనా సోకడంతో ఆయన  కోలుకున్నాక తీసుకుంటారని వినికిడి. ప్రస్తుతానికి 45 ఏళ్ల వయసున్న వాళ్లకే వ్యాక్సిన్‌ ఇస్తున్నారు కాబట్టి యువ హీరోలంతా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి నోచుకోనట్లే. అయితే ఇన్‌ఫ్లూయెన్స్‌ ఉపయోగిస్తే ఏజ్‌తో సంబంధం లేకుండా టీకాలు వేస్తున్నారని, అదొక సెపరేట్‌ వింగ్‌ అని తెలిస్తోంది. 

సీనియర్‌ నటి నదియా, రమ్యకృష్ణ ఇటీవల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. హాట్ బ్యూటీ పాయల్ రాజపుత్ గురువారం టీకా తీసుకున్నారు. సంబంధిత ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి అభిమానులకు, ప్రేక్షకులకు కూడా తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోమని పిలుపునిచ్చారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటి మాధురీ దీక్షిత్‌ కూడా రెండో వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. ఇంకా కొందరు యువతరం హీరోలు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్‌ తీసుకొన్నప్పటికీ అధికారికంగా ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే ఇప్పుడు 



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.