చీటింగ్ కేసులో ప్రముఖ దర్శకుడు అరెస్ట్

ABN , First Publish Date - 2021-05-07T23:22:35+05:30 IST

ప్రముఖ మళయాళీ సినీ దర్శకుడు, యాడ్ ఫిల్మ్‌మేకర్ వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గ్రూప్‌ బిజినెస్‌లో...

చీటింగ్ కేసులో ప్రముఖ దర్శకుడు అరెస్ట్

అలప్పుజ: ప్రముఖ మళయాళీ సినీ దర్శకుడు, యాడ్ ఫిల్మ్‌మేకర్ వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గ్రూప్‌ బిజినెస్‌లో రూ. 5 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తర పాలక్కాడ్ జిల్లాలో సదరు డైరెక్టర్ నివాసంలో గురువారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. మీనన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జిల్లాకోర్టు తిరస్కరించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మీనన్‌పై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదైనట్టు అలప్పుజ డీఎస్పీ డీకే పృథ్విరాజ్ వెల్లడించారు. కాగా ప్రముఖ నటి మంజు వారియర్‌ను బెదిరించి, పరువునష్టం కలిగించారన్న ఆరోపణలపై 2019లో మీనన్‌ అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. మోహన్‌లాల్- మంజువారియర్ నటించిన ‘‘ఒడియన్’’ సినిమాతో డైరెక్టర్‌గా మీనన్ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 

Updated Date - 2021-05-07T23:22:35+05:30 IST