బీఈడీ, లా కోర్సుల ఫీజుల ఖరారు

ABN , First Publish Date - 2022-06-29T21:09:50+05:30 IST

రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల ఫీజులను తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) ఖరారు చేసింది. 2022-23 నుంచి వచ్చే

బీఈడీ, లా కోర్సుల ఫీజుల ఖరారు

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల ఫీజులను తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) ఖరారు చేసింది. 2022-23 నుంచి వచ్చే మూడేళ్ల పాటు ఈ ఫీజులే అమలులోకి వస్తాయి. 2019-22లో నిర్ణయించిన ఫీజుల అమలు గడువు ముగియడంతో 2022-25కు కొత్త ఫీజులను ఖరారు చేసినట్లు టీఏఎఫ్‌ఆర్‌సీ తెలిపింది. వాస్తవానికి ఇంజనీరింగ్‌తో పాటు, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ, బీపీఈడీ వంటి అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ముందస్తుగా బీఈడీ, లా, ఎల్‌ఎల్‌ఎం, బీపీఈడీ కోర్సుల ఫీజులను మాత్రమే ఖరారు చేసినట్లు ఉన్నత విద్యా శాఖ అధికారులు తెలిపారు. బీఈడీ కనిష్ఠ ఫీజును రూ.20 వేలు, గరిష్ఠ ఫీజును రూ. 36 వేలుగా నిర్ణయించారు.


లా కోర్సు కనిష్ఠ ఫీజు రూ.20 వేలు, గరిష్ఠ ఫీజు రూ.36 వేల వరకు ఖరారు చేశారు. ఎల్‌ఎల్‌ఎం కనిష్ఠం రూ.20 వేలు, గరిష్ఠం రూ.45 వేలుగా, బీపీఈడీ కనిష్ఠం రూ.17 వేలు, గరిష్ఠం రూ.28 వేల వరకు ఖరారు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. కాగా, టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ పదవీ కాలం గత నెల 27తో ముగియడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుత చైర్మన్‌ను కొనసాగించడమా లేదా కొత్త ఛైర్మన్‌ను నియమించే విషయం తేలిన తర్వాతే మిగిలిన కోర్సుల ఫీజు ఖరారుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2022-06-29T21:09:50+05:30 IST