New Tax Regime : నూతన పన్ను విధానం?.. త్వరలో ఆర్థిక శాఖ సమీక్ష..

ABN , First Publish Date - 2022-08-15T03:09:59+05:30 IST

మరో కొత్త పన్ను చెల్లింపు విధానం(New Tax Regime) రాబోతోందా?.. అంటే ఔననే అంటున్నాయి ప్రభుత్వవర్గాలు. ఎలాంటి మినహాయింపులు లేని నూతన పన్ను విధానం రూపకల్పనపై త్వరలోనే కేంద్ర

New Tax Regime : నూతన పన్ను విధానం?.. త్వరలో ఆర్థిక శాఖ సమీక్ష..

న్యూఢిల్లీ : మరో కొత్త పన్ను చెల్లింపు విధానం(New Tax Regime) రాబోతోందా?.. అంటే ఔననే అంటున్నాయి ప్రభుత్వవర్గాలు. ఎలాంటి మినహాయింపులు లేని నూతన పన్ను విధానం రూపకల్పనపై త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ (Finance Ministry) సమీక్ష నిర్వహించబోతోందని తెలుస్తోంది. ఎలాంటి ఉపశమనాలు ఉండని కొత్త పద్ధతికి రూపకల్పన చేయడంతోపాటు మినహాయింపులు- తగ్గింపులతో సంక్లిష్టంగా ఉన్న పాత విధానానికి చరమగీతం పాడడం ముఖ్యోద్దేశమని ఆయా వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత పన్నుచెల్లింపుదార్లకు మరింత ఊరటనివ్వడం, ఆదాయ పన్ను చట్టాన్ని సులభతరంగా మార్చడం ప్రభుత్వ ప్రాధాన్యతలుగా ఉన్నాయని తెలిపాయి. 


కాగా కొత్త పన్నుల విధానానికి చెల్లింపుదార్ల నుంచి ఎలాంటి స్పందన వస్తోందని ప్రశ్నించిగా అధికారులు స్పందిస్తూ.. గృహ, విద్య రుణాలను పూర్తిగా చెల్లించిన వారు కొత్త విధానాన్ని ఎంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పాత విధానంలో ఎలాంటి మినహాయింపులు లేకపోవడంతోపాటు పన్ను రేట్లు తక్కువగా ఉండడం ముఖ్యకారణాలు చెప్పారు.


కాగా కేంద్ర బడ్జెట్ 2020-21లో కేంద్ర పన్ను విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీంతో మినహాయింపులు, వేర్వేరు తగ్గింపులతో కూడిన పాత విధానాన్ని లేదా ఎలాంటి తగ్గింపులు లేకుండా తక్కువ పన్ను రేటు కలిగిన కొత్త విధానాన్ని ఎంచుకునేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. కాగా ఇదే తరహాలో కార్పొరేటు పన్ను చెల్లింపుదార్ల కోసం సెప్టెంబర్ 2019లో కొత్త విధానాన్ని కేంద్ర ప్రవేశపెట్టింది. ఇందులో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు.

Updated Date - 2022-08-15T03:09:59+05:30 IST