‘ఆర్థిక’ అధికారులవి పిట్టకథలు

ABN , First Publish Date - 2022-07-01T09:02:58+05:30 IST

‘ఆర్థిక’ అధికారులవి పిట్టకథలు

‘ఆర్థిక’ అధికారులవి పిట్టకథలు

జీపీఎఫ్‌ సొమ్ము మాయంపై న్యాయపోరాటం చేస్తాం

సీఎస్‌ను కలిసి వివరణ కోరాం

అకౌంటెంట్‌ జనరల్‌కూ ఫిర్యాదు చేశాం

ఏపీ ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ


అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో సొమ్ము మాయమవడంపై న్యాయపోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు ఏమయ్యాయంటే ఆర్థికశాఖ అధికారులు పిట్టకథలు చెప్పారని మండిపడ్డారు. దీనిపై సీఎస్‌ సమీర్‌శర్మను వివరణ కోరినట్లు తెలిపారు. ఆయనతోపాటు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు గురువారం సచివాలయంలో సీఎ్‌సను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్థికశాఖాధికారులు అబద్ధాలు చెబుతున్నారని సీఎ్‌సకు చెప్పామన్నారు. సీఎస్‌ కూడా చాలా సింపుల్‌గా ఇదేదో మిస్టేక్‌ అని చెబుతున్నారని మండిపడ్డారు. టెక్నికల్‌ సమస్య వల్ల ఖాతాల్లో డబ్బు పోయిందని అధికారులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ‘అనుమతి లేకుండా మా ఖాతాల నుంచి డబ్బులు తీయడం నేరం కాదా?’ అని ప్రశ్నించారు. ‘డీఏ బకాయిల చెల్లింపుపై గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డీఏ బకాయిలతోనే జీతాలు పెరిగినట్లు గతంలోనే చెప్పారు. ఇప్పుడు డీఏ బకాయిలు వేయలేదంటున్నారు. వీటిల్లో ఏది నిజం?’ అని నిలదీశారు. ఉద్యోగులు, సంఘ నాయకులను కిండర్‌ గార్డెన్‌ చిల్డ్రన్‌గా, ఎల్‌కేజీ సూడెంట్లుగా పరిగణించవద్దని, జాక్‌ అండ్‌ జిల్‌ స్టోరీలు చెప్పే పద్ధతి మానుకోవాలని అధికారులకు చెప్పామన్నారు. ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. ఆయన నుంచి సమాధానం వచ్చాక న్యాయపోరాటానికి సిద్ధమౌతామని తెలిపారు. సీఎస్‌, ఆర్థికశాఖ ఉద్యోగులు, సీఎ్‌ఫఎంఎస్‌, ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ను కూడా ప్రతివాదులుగా చేరుస్తామన్నారు. సీఎ్‌ఫఎంఎ్‌సలో తమకు తెలియకుండా తమ ఖాతాల్లో డబ్బు తీసే ఆప్షన్‌ను తొలగించే వరకు పోరాటం చేస్తామని సీఎ్‌సకు చెప్పామన్నారు. ‘నా ఖాతాలో డబ్బులు నాకు తెలియకుండా తీసే యాక్ససిబులిటీ ఉండటం చట్టబద్ధమా?ఇప్పుడు జీపీఎఫ్‌ అకౌంట్‌లో సొమ్ము మాయమైంది. భవిష్యత్తులో మా జీతాల అకౌంట్‌లో కూడా ఇదే పరిస్థితి తలెత్తదని గ్యారెంటీ ఏమిటి? గతంలో పీఆర్సీ సందర్భంలో జీతం తగ్గుతుందని మేం చెబితే, జీతం పెరుగుతుందని సీఎస్‌ అన్నారు. ఈ డీఏ ఎరియర్స్‌ కలిపి స్లిప్పులు తీసి జీతం పెరిగిందని చూపించారు. అప్పుడు సీఎస్‌ చెప్పింది నిజమైతే... ఇప్పుడు ఆర్థికశాఖ అధికారులు డెబిట్‌ అవ్వలేదని చెప్పింది అబద్ధమా? ఏది నిజం?’అని ప్రశ్నించారు. దీనిపై శుక్రవారం సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు. మిగతా సంఘాలు వచ్చినా, రాకపోయినా ముందుకి వెళతామని చెప్పారు.

Updated Date - 2022-07-01T09:02:58+05:30 IST