అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్ధిక సాయం

Published: Mon, 13 Dec 2021 17:10:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్ధిక సాయం

హైదరాబాద్: కోవిద్ 19 తోపాటు అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఈ నెల 15 వ తేదీన ఆర్థిక సహాయం అందించే చెక్కుల పంపిణీని చేస్తున్నట్టు మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర్ రావు తెలిపారు. డిసెంబర్ 15 న ఉదయం11.30 గంటలకు మాసాబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ లో ఉన్న మీడియా అకాడమీ కార్యాలయంలో నిర్వహించే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్ తోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్బంగా అనారోగ్యంతో పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు కూడా ఆర్థిక సహాయం అందచేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.