మహిళలకు ఆర్థిక ‘చేయూత’

ABN , First Publish Date - 2021-06-23T07:45:41+05:30 IST

మహిళల ఆర్థిక పురోగతి కోసమే వైఎస్సార్‌ చేయూతను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

మహిళలకు ఆర్థిక ‘చేయూత’
లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న ప్రవీణ్‌కుమార్‌

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), జూన్‌ 22 : మహిళల ఆర్థిక పురోగతి కోసమే వైఎస్సార్‌ చేయూతను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. పథకం రెండో విడత నగదు జమ కార్యక్ర మాన్ని మంగళవారం సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం ప్రకాశం భవన్‌లోని సమావేశం హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కలెక్టర్‌ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత మొదటి విడత జిల్లాలో 1.42 లక్షల మందికి నగదు జమ అయ్యిందన్నారు. రెండో విడతలో 1,39,417 మంది లబ్ధిపొందుతున్నారని చెప్పారు. వీరి బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.260 కోట్ల నగదు బదిలీ జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ కృష్ణవేణి, ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్‌ వేమూరి సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-23T07:45:41+05:30 IST