సచివాలయాల నిర్వాహణకు ఆర్థిక సమస్యలు

ABN , First Publish Date - 2021-07-30T06:35:33+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సచివాలయాల నిర్వాహణకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.

సచివాలయాల నిర్వాహణకు ఆర్థిక సమస్యలు
సచివాలయంలో నిరపయోగంగా ఉన్న ప్రింటర్‌


 - నిధుల కేటాయింపునకు  నోచుకోని వ్యవస్థ

- పేపర్‌ కొనాలన్నా ఇబ్బందులు  పడుతున్న కార్యదర్శులు

- దృష్టిసాధించని ఉన్నతాధికారులు

అనంతపురం రైల్వే, జూలై29: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సచివాలయాల నిర్వాహణకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. 2019 అక్టోబర్‌-2 నుంచి అమ లులోకి వచ్చిన సచివాలయాలకు ప్రారంభంలో అరకొరగా సా మగ్రి పంపిణీ చేశారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సొంత భవ నాలు లేనప్పటికీ అద్దె భవనాల్లోనే నెట్టుకొస్తున్నారు. ప్రజలకు అందాల్సిన ప్రతి సంక్షేమ పథకం సచివాలయాల నుండే అమ లు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే అందుకు అ నుగుణంగా బడ్జెట్‌ కేటాయింపు లేకపోవడంతో అక్కడ సిబ్బం దికి ఇబ్బందులు తప్పడం లేదు. చాలాచోట్ల ప్రారంభంలో పంపి ణీ చేసిన పేపర్‌ అయిపోయింది. కంప్యూటర్లు, ప్రింటర్లు మర మ్మతుల కొచ్చాయి. వాటికి మరమ్మతులు చేయించలేని పరిస్థితి నెలకొంది. ఆఖరికి లబ్ధిదారులకు అర్హత ధ్రువీకరణ పత్రం ప్రింట్‌ తీసి ఇవ్వాలన్న కొన్ని సచివాయాల్లో పేపర్‌ కొతర ఉన్న ట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రింట ర్‌కు సంబంధించి ఇంకు అయిపోవడంతో వినియోగించకుండా పక్కన పడేసినట్లు తెలుస్తోంది. అలాగే కంప్యూటర్‌ మరమ్మ తులు. దీనికి తోడు మారుమూల ప్రాంతాలకు నెట్‌ సౌకర్యంలేక, డేటాకు ఖర్చులు భరించలేక స్థానిక సిబ్బంది ఇబ్బందులు ప డుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఆర్భాటంగా ప్రారంభించి అమలు చేస్తున్నా... తగిన నిధులు కేటాయించకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలో 896 సచివాలయాలున్నాయి. వీటిలో దాదాపు 50 శాతం వరకు సచివాయాల్లో సమస్యలు ఉ న్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు లబ్ధిదారుల వివరాలు, అర్హత, అనర్హత వివరాలను ఫెక్సీల ద్వారా కార్యాలయంలో ప్రకటించా లని చెపుతున్నారు. కానీ వాటికి అయ్యే ఖర్చులను ఎక్కడ నుం చి భరించాలన్నది సెక్రటరీలకు అర్థం కాని పరిస్థితిగా మారింది. పంచాయతీలకు సంబంధించి డ్రాయింగ్‌ అథారిటీ ఉన్న సె క్రటరీ సచివాలయాలకు ఇంచార్జ్‌గా ఉన్నప్పటికి పంచాయతీ నిధులను సచివాలయాలకు వినియోగిస్తే.. అడిట్‌ సమస్యలు త లెత్తే అవకాశం ఉన్నట్లు కొందరు సెక్రటరీలు చెబుతున్నారు.

  జిల్లాలోని 896 సచివాలయాలకు 896 మంది డిజిటల్‌ అసిస్టెంట్లను నియమించారు. వీరితో పాటు గ్రేడ్‌-5 సెక్రటరీలు, వెల్‌ఫేర్‌ అసిస్టెంట్లు ఇలా 11 విభాగాలకు సంబంధించి సి బ్బందిని నియమించారు. ఇంత మంది ఉన్నప్పుడు నిర్వాహణకు నిధులు కేటాయింపు లేకపోవడం ప్రశ్నార్థకరంగా మారింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ జాయింట్‌ కలెక్టర్‌ను నియమించింది.  సచివాల యాల నిర్వాహణకు సంబంధించి ఆ జేసీకి నిధులు కేటాయించి నట్లు తెలిసింది. అయితే సచివాలయాల్లో నెలకొన్న సమస్యలకు జేసీ ద్వారా ఏవిధంగా మంజూరు చేయించుకోవాలో అర్థంకాక సెక్రటరీలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేనట్లు తెలుస్తోంది. 

నిధుల వినియోగంపై ఉత్తర్వులు రావాల్సి ఉంది

 - పార్వతి, డీపీఓ 

సచివాలయాలకు నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రభు త్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి బడ్జెట్‌ కేటాయింపులు లేవు. ప్రారంభంలో సరిపడా సామగ్రి సరఫరా చేశాం. కొన్ని ప్రాంతాల్లో సామగ్రి అయిపోయి ఏవైనా సమస్యలు ఉంటే జేసీతో మాట్లాడుతాం. వాటికి అనుగుణంగా తగిన చర్యలు చేపట్టి సమస్యలు తలెత్త కుండా చూస్తాం.




Updated Date - 2021-07-30T06:35:33+05:30 IST