బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక వనరులు కల్పించాలి

ABN , First Publish Date - 2020-11-24T10:36:21+05:30 IST

బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక వనరుల కల్పించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. సోమవారం మరిపెడ అర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన

బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక వనరులు కల్పించాలి

బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌


మరిపెడ, నవంబరు 23: బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక వనరుల కల్పించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. సోమవారం మరిపెడ అర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఓట్ల ద్వారా అధికారం పొంది మొండిచేయ్యి చూపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 60 శాతం మంది బీసీ జనాబా వద్ద ఉండే సంపద 11 మంది చేతుల్లో ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు ఆర్థిక వనరులతోపాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర యువజన కార్యదర్శి గుండగాని వేణు, ఉపేందర్‌, భరత్‌, రమేష్‌, ఉమేష్‌, రామచంద్రయ్య పాల్గొన్నారు

Updated Date - 2020-11-24T10:36:21+05:30 IST