బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు!

ABN , First Publish Date - 2022-06-28T09:00:06+05:30 IST

మీరు ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సు ఏ స్టాప్‌లో ఉంది? మీరున్న స్టాప్‌కు మరెన్ని నిమిషాల్లో చేరుతుంది? ఈ విషయాలు తెలుసుకోవడం...

బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు!

39 పుష్పక్‌ ఏసీ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం

జూలై రెండో వారంలో ఆర్టీసీ ప్రత్యేక యాప్‌


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): మీరు ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సు ఏ స్టాప్‌లో ఉంది? మీరున్న స్టాప్‌కు మరెన్ని నిమిషాల్లో చేరుతుంది? ఈ విషయాలు తెలుసుకోవడం ఇక ఎంతో సులువు. రాబోయే రోజుల్లో యాప్‌లో ప్రయాణికులు ముందే ఈ వివరాలు తెలుసుకునే సౌలభ్యాన్ని టీఎ్‌సఆర్టీసీ కల్పించబోతోంది. బస్సుల సమయపాలన వివరాలతో పాటు బస్సు ఏ నిమిషంలో ఎక్కడ ఉందనే  అంశాలు ప్రయాణికులు ఎప్పటికప్పుడు వెహికిల్‌ ట్రాకింగ్‌ ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(వీటీపీఐఎస్‌) యాప్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్‌లో శంషాబాద్‌ రూట్‌లో నడుపుతున్న పుష్పక్‌ ఏసీ ఎలక్ర్టికల్‌ బస్సుల్లో తొలుత వీటీపీఐఎ్‌సను ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఆర్టీసీ అధికారులు.. దానికి సంబంధించిన ఓ ప్రత్యేక యాప్‌ను జూలై రెండో వారంలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తొలివిడతగా 1500 బస్సుల్లో వీటీపీఐఎ్‌సను తీసుకురానున్నారు. రెండో విడతలో మరో 2 వేల బస్సుల్లో అందుబాటులోకి తీసుకొస్తారు. దీని వల్ల ప్రయాణం సులభతరంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత 850 మెట్రో బస్సుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో ఆర్టీసీ నడుపుతున్న బస్సుల వివరాలు, సమయపాలన యాప్‌లో అందుబాటులోకి తెస్తే హైదారాబాద్‌లో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.  వీటీపీఐఎస్‌ సిటీ బస్సుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రయాణికులు 30-40ు పెరిగే అవకాశం ఉంటుందని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-06-28T09:00:06+05:30 IST