మాస్కులు ధరించని వారికి జరిమానా

ABN , First Publish Date - 2021-04-24T04:26:25+05:30 IST

పులివెందులలో మాస్కులు ధరించని వారికి పోలీసులు జరిమా నా విధిస్తున్నారు.

మాస్కులు ధరించని వారికి జరిమానా
మాస్కు ధరించని యువకులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్న సీఐ భాస్కర్‌రెడ్డి

పులివెందుల రూరల్‌, ఏప్రిల్‌ 23: పులివెందులలో మాస్కులు ధరించని వారికి పోలీసులు జరిమా నా విధిస్తున్నారు. శుక్రవారం బీఎస్‌ఎనఎల్‌, పూ లంగళ్ల సర్కిల్‌లో సీఐ భాస్కర్‌రెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐలు చిరంజీవి, గోపీనాథ్‌రెడ్డి, హనుమంతు మాస్కులు ధరించని పాదచారులు, ద్విచక్రవాహ న దారులకు జరిమానా విధించారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సీఐ కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

కరోనా నివారణకు మాస్క్‌ ఆయుధం

వేముల, ఏప్రిల్‌ 23: కరోనా మహమ్మారి నివారణకు మాస్క్‌ వినియోగించాలని పులివెందుల రూరల్‌ సీఐ రవీంద్రనాథరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం వేముల బస్టాండ్‌లో స్థానిక వ్యాపారులు, ప్రజలతో నిర్వహించిన సమావేశంలో రూరల్‌ సీఐ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వేగంగా విస్తరిస్తున్నందున ప్రతి ఒక్క వ్యాపారీ దుకాణాల వద్ద నిబంధన లు పాటించాలన్నారు.  కార్యక్రమంలో  ఎస్‌ఐ సంజీవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-04-24T04:26:25+05:30 IST