రికార్డ్ హైకి Fine Organic షేర్లు.. మూడు నెలల్లో 56% పెరిగిన స్టాక్

ABN , First Publish Date - 2022-08-10T17:34:45+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఫైన్ ఆర్గానిక్(Fine Organic) కంపెనీ ఫైన్‌గా లాభాలను తన ఖాతాలో వేసుకుంది.

రికార్డ్ హైకి Fine Organic షేర్లు.. మూడు నెలల్లో 56% పెరిగిన స్టాక్

Fine Organic Shares : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఫైన్ ఆర్గానిక్(Fine Organic) కంపెనీ ఫైన్‌గా లాభాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో కంపెనీ షేర్లకు రెక్కలొచ్చాయి. ఏకంగా ఆకాశానికి దూసుకెళ్లాయి. బుధవారం ఇంట్రా డే(Intra day)లో కంపెనీ షేర్లు(Fine Organic Shares) 19 శాతం ర్యాలీ చేసి రికార్డ్ గరిష్టం రూ.6,909కి చేరాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం నాలుగు రెట్లు పెరిగి రూ.157.28 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.34.93 కోట్లుగా ఉంది. 


సీక్వెన్షియల్ ప్రాతిపదికన, మార్చి 2022 త్రైమాసికంలో రూ. 122 కోట్ల నుంచి నికర లాభం 29 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.358 కోట్ల నుంచి సమీక్షిస్తున్న త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం రెండింతలు పెరిగి రూ.748 కోట్లకు చేరుకుంది. క్రితం త్రైమాసికంలో రూ.617 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 


ఉదయం 10:22 గంటలకు స్టాక్ 14 శాతం లాభంతో రూ.6,630 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌(Sensex)లో స్వల్పంగా 0.01 శాతం పెరిగింది. ఇది జూన్ 2, 2022న తాకిన దాని మునుపటి గరిష్ట స్థాయి రూ.6,139ని నేడు అధిగమించింది. గత మూడు నెలల్లో ఫైన్ ఆర్గానిక్ స్టాక్ ధర((Fine Organic Stock Price) 56 శాతం పెరిగింది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 శాతం పెరిగింది. 

Updated Date - 2022-08-10T17:34:45+05:30 IST