Fingerprint: విదేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు మారుస్తున్న ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-01T21:44:39+05:30 IST

విదేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు మారుస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్తాన్, కేరళ, హైదరాబాద్

Fingerprint: విదేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు మారుస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్: విదేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు మారుస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్తాన్, కేరళ, హైదరాబాద్ (Hyderabad)లో రూ.25 వేలకు ఫింగర్ ప్రింట్స్‌ (Fingerprint)ను ముఠా సభ్యులు మారుస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో కడప (Kadapa)కు చెందిన ఎక్స్రే టెక్నీషియన్ నాగ మునీశ్వర్రెడ్డి, అనస్థీషియా టెక్నీషియన్ వెంకటరమణను అరెస్ట్ చేశామని సీపీ మహేష్భగవత్ (CP Mahesh Bhagwat)తెలిపారు. సర్జరీ చేసుకున్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేశామని ఆయన వివరించారు. హైదరాబాద్లో సర్జరీ చేయడానికి వచ్చారన్న.. సమాచారంతోనే దాడులు చేశామని తెలిపారు. సర్జరీకి సంబంధించి చిన్న అనస్థీషియా ఇస్తారని, ఏడాది వరకు ఫింగర్ ప్రింట్ రాదని పేర్కొన్నారు. సర్జరీ చేయించుకున్న వారు 3 నెలల తర్వాత కువైట్కు దరఖాస్తు చేసుకుంటారని, అక్కడికి వెళ్లిన తర్వాత మళ్లీ ఫింగర్ ప్రింట్స్తో దొరుకుతున్నారని చెప్పారు. కువైట్లో ఏడురోజుల జైలుశిక్ష వేసి.. తిరిగి పంపిస్తున్నారని తెలిపారు. కువైట్లో ఫింగర్ ప్రింట్ చెక్ చేస్తున్నారని, ఈ తరహా క్రైమ్పై ఇమ్మిగ్రేషన్ అధికారులను అలెర్ట్ చేశామని పేర్కొన్నారు. కువైట్ ఎంబసీ అధికారులకు సమాచారం అందిస్తామని మహేష్భగవత్ తెలిపారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ఇంటి దగ్గరకే వెళ్లి ముఠా సర్జరీలు చేస్తున్నట్లు గుర్తించాయని పేర్కొన్నారు. 


హైదరాబాద్లో వేలిముద్రల ముఠా బాగోతం ఆలస్యంగా బయటపడింది. గల్ఫ్ (Gulf) వెళ్లేందుకు వేలిముద్రలు రిజెక్ట్ కావడంతో యువకులు ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఏడాది పాటు వేలిముద్రలు కనబడకుండా ఉండేలా కొత్త రకం సర్జరీ చేస్తున్నారు. సర్జరీ చేస్తున్న డాక్టర్తోపాటు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గల్ఫ్ వెళ్లేందుకు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సర్జరీ తర్వాత దొడ్డి దారిన యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-09-01T21:44:39+05:30 IST