మహిళా సాధికారితకు ‘ఫినోలెక్స్‌’ చేయూత

ABN , First Publish Date - 2021-03-03T06:30:31+05:30 IST

ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఐఎల్‌) మహి ళా సాధికారిత కోసం కృషి చేస్తోం ది. కంపెనీ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కార్యక్రమం కింద ముకుల్‌ మాధవ్‌ ఫౌండేషన్‌ (ఎంఎంఎ్‌ఫ)తో కలిసి ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది

మహిళా సాధికారితకు ‘ఫినోలెక్స్‌’ చేయూత

హైదరాబాద్‌ : ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఐఎల్‌) మహి ళా సాధికారిత కోసం కృషి చేస్తోం ది. కంపెనీ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కార్యక్రమం కింద ముకుల్‌ మాధవ్‌ ఫౌండేషన్‌ (ఎంఎంఎ్‌ఫ)తో కలిసి ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2019లో మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లాలో భర్తలను కోల్పోయిన 312 మహిళా రైతులకు ఉత్తమ సాగు పద్దతులు, భూసార పరీక్షలు, చేతికొచ్చిన పంటలను మంచి ధరకు ఎలా అమ్ముకోవాలనే అంశాలపై శిక్షణ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఉస్మానాబాద్‌ జిల్లాలోని  60 శాతం మహిళా రైతులు తమ అప్పులు తీర్చుకోవడంతో పాటు పిల్లల్ని చక్కగా చదివించుకోగలుగుతున్నారు. ఇదికాకుండా స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంతో కలిసి కొంతమంది మహిళా రైతులకు ఉచితంగా 30 కిలోల చొప్పున సోయా, 15 కిలోల చొప్పున కంది విత్తనాలు అందించింది.  మహారాష్ట్రలోనే బీఐఎ్‌సఎల్‌డీ అనే సంస్థతో కలిసి వంద మంది మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రికీకరణ, దిగుబడులు పెంచడంలో శిక్షణ ఇచ్చింది. ఈ వంద మంది ఇప్పుడు మరో వెయ్యి మంది మహిఽళా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. 

Updated Date - 2021-03-03T06:30:31+05:30 IST