అల్ఫామేడ్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-06-20T05:33:22+05:30 IST

అల్ఫామేడ్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

అల్ఫామేడ్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం
పరిశ్రమ నుంచి ఎగసిపడుతున్న మంటలు

మూడుచింతలపల్లి: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామ పరిధిలో ఉన్న అల్ఫామేడ్‌ పరిశ్రమలోని ఐపీ బ్లాకులో శనివారం రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్యలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అల్ఫామేడ్‌ పరిశ్రమలో భారీఎత్తున మంటలు చెలరేగాయి. కాగా పరిశ్రమలో ఎవరూ లేనందున ప్రాణనష్టం జరుగలేదు. ఆస్తి నష్టం అంచనా వేయాలంటే మంటలు అదుపులోకి వస్తేనే సాధ్యమవుతుంది. అయితే ఫైరింజన్‌లు వచ్చి మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా ఎంతకూ అదుపులోకి రావడం లేదు.

Updated Date - 2021-06-20T05:33:22+05:30 IST