షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-11-30T05:10:55+05:30 IST

తోణాంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సోమవారం ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది.

షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

సాలూరు రూరల్‌: తోణాంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సోమవారం ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన బగ్గాం మణిమాల అనే మహిళ వృథాగా ఉన్న ఓ క్వార్టర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్వార్టర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆమె ఇన్నేళ్లు కష్టపడి సంపాధించిన నగదు రూ.60వేలతో పాటు సామగ్రి కాలి బూడిదయ్యాయి. పేదరాలైన ఆమె ఈ అగ్ని ప్రమాదంతో నిరుపేదగా మారింది. సమాచారం అందుకున్న సాలూరు అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. 

 


Updated Date - 2021-11-30T05:10:55+05:30 IST