Firebrand BJP leader: సీమాంచల్ ముస్లిం జనాభాలో అధికులు రోహింగ్యాలు, బంగ్లాదేశీయులే... కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-03T15:45:30+05:30 IST

భారతీయ జనతాపార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్(Firebrand BJP leader), కేంద్ర మంత్రి(Union Minister) గిరిరాజ్ సింగ్(Giriraj Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు....

Firebrand BJP leader: సీమాంచల్ ముస్లిం జనాభాలో అధికులు రోహింగ్యాలు,  బంగ్లాదేశీయులే... కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

పాట్నా(బీహార్): భారతీయ జనతాపార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్(Firebrand BJP leader), కేంద్ర మంత్రి(Union Minister) గిరిరాజ్ సింగ్(Giriraj Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరహాలో బీహార్(Bihar) రాష్ట్రంలోనూ మసీదులు, మదర్సాలపై( madrasas and mosques) సర్వే చేయాలని గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బీహార్ రాష్ట్రంలోని సీమాంచల్ రీజియన్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న మసీదులు, మదరసాలు ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో ఎవరు నివాసముంటున్నారు? అనే సమాచారం మా వద్ద ఉంది, దీనిపై సర్వే చేయాలని డిమాండ్(demanded) చేస్తున్నాం’’ అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు.


యూపీలో(Uttar Pradesh) యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మసీదులు, మదరసాల్లో ఎవరు షెల్టర్ తీసుకుంటున్నారనే(shelters in madrasas and mosques)విషయంపై సర్వే చేస్తుందని, ఈ సర్వే నిర్ణయం సరైనదని మంత్రి చెప్పారు.సీమాంచల్ ప్రాంతంలో(Seemanchal region) 60 శాతం మంది జనాభా ముస్లింలున్నారని,(Muslim-dominated Seemanchal region) వారిలో ఎక్కువ మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయులని( Rohingya and Bangladeshi nationals), విదేశీయులు అక్రమంగా సీమాంచల్ ప్రాంతంలో నివాసముంటున్నారని మంత్రి చెప్పారు. 

Updated Date - 2022-09-03T15:45:30+05:30 IST