నిలువెత్తు మంటల మధ్య.. ట్రక్ నడిపిన ఫైర్‌ఫైటర్లు

ABN , First Publish Date - 2021-07-25T11:26:56+05:30 IST

అమెరికాలోని నెవాడాలో ఇటీవల మొదలైన కార్చిచ్చు భీకర రూపం దాలుస్తోంది. టమరాక్ ప్రాంతంలో

నిలువెత్తు మంటల మధ్య.. ట్రక్ నడిపిన ఫైర్‌ఫైటర్లు

నెవాడా: అమెరికాలోని నెవాడాలో ఇటీవల మొదలైన కార్చిచ్చు భీకర రూపం దాలుస్తోంది. టమరాక్ ప్రాంతంలో మొదలైన ఈ కార్చిచ్చు ఇప్పటికే 50వేల ఎకరాల పాటు మొత్తం భస్మీపటలం చేసింది. జూలై 4న మొదలై ఇప్పటికీ భయంకరంగా మండుతున్న ఈ ప్రాంతంలో అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో నిలువెత్తు మంటల మధ్యలో ట్రక్కు నడుపుతున్న అగ్నిమాపక సిబ్బంది వీడియోను  ఆ శాఖ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అగ్నిమాపక సిబ్బంది వెళ్తున్న ట్రక్కు చుట్టూతా మంటలు భగభగలాడుతున్నాయి. మంటల నుంచి వచ్చే నల్లటి పొగలు ట్రక్కు విండ్‌స్క్రీన్‌ను కప్పేయడం కూడా వీడియోలో చూడొచ్చు.

Updated Date - 2021-07-25T11:26:56+05:30 IST