స్పైస్‌జెట్‌ విమానం ఇంజన్‌లో మంటలు

ABN , First Publish Date - 2022-06-20T09:29:49+05:30 IST

పట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన ఓ స్పైస్‌జెట్‌ విమానానికి ఆదివారం పెను ప్రమాదం తప్పింది.

స్పైస్‌జెట్‌ విమానం ఇంజన్‌లో మంటలు

పట్నా, జూన్‌ 19: పట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన ఓ స్పైస్‌జెట్‌ విమానానికి ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఆ విమానం పట్నా ఎయిర్‌పోర్ట్‌ నుంచి గాల్లోకి ఎగరగానే ఎడమవైపు ఇంజన్‌కు మంటలంటుకున్నాయి. ప్రయాణికులు, కేబిన్‌ సిబ్బంది గమనించి పైలట్లను అప్రమత్తం చేశారు. టేకాఫ్‌ సమయంలో ఓ పక్షి ఢీకొనడం వల్లే ఇంజన్‌లో మంటలు చెలరేగాయని స్పైస్‌జెట్‌ వివరించింది. ప్రయాణికులంతా క్షేమమని పేర్కొంది. 

Updated Date - 2022-06-20T09:29:49+05:30 IST