ఉమ్మడి జిల్లాలో తొలిరోజు వ్యాక్సినేషన్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-01-17T05:17:03+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా గత పది నెలలుగా ప్రా ణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్న ప్రజలకు వ్యాక్సిన్‌ రాకతో కాస్త ఉపశమనం లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు శనివారం నుంచి అధికారికంగా చేపట్టిన కరోనా వ్యా క్సిన్‌ పంపిణీ కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొలిరోజు విజయవంతమైంది.

ఉమ్మడి జిల్లాలో తొలిరోజు వ్యాక్సినేషన్‌ విజయవంతం
నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికుడు అజయ్‌కి వ్యాక్సిన్‌ వేస్తున్న దృశ్యం

పది కేంద్రాలలో టీకా తీసుకున్న 358 మంది

వైద్యసిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు వ్యాక్సిన్‌

ఉమ్మడి జిల్లాలో డిచ్‌పల్లిలో తొలి టీకా తీసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త విజయ

సదాశినగర్‌లో అత్యధికంగా 59 మందికి

టీకా తీసుకున్న వారిలో కనిపించని సైడ్‌ఎఫెక్ట్స్‌ 

నిజామాబాద్‌లో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కామారెడ్డిలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

కామారెడ్డి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి), నిజామాబాద్‌ అర్బన్‌ : కరోనా మహమ్మారి కారణంగా గత పది నెలలుగా ప్రా ణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్న ప్రజలకు వ్యాక్సిన్‌ రాకతో కాస్త ఉపశమనం లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు శనివారం నుంచి అధికారికంగా చేపట్టిన కరోనా వ్యా క్సిన్‌ పంపిణీ కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొలిరోజు విజయవంతమైంది. ఉభయ జిల్లాల్లో తొలిరోజు మొత్తం 10 కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్‌ వేశారు. అన్ని కేం ద్రాలలోనూ టీకా కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. రెండు జిల్లాల్లో మొదటి రోజు మొత్తం 358 మంది వైద్యాధికారులు, సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు టీకా అం దించారు. ఉమ్మడి జిల్లాలో మొదటి టీకా డిచ్‌పల్లి కేంద్రం లో అంగన్‌వాడీ కార్యకర్త విజయ తీసుకున్నారు. నిజామా బాద్‌ జిల్లాలోని వైద్యకళాశాల అనుబంధ ఆసుపత్రిలో నిర్వ హించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖమంత్రి ప్రశాంత్‌రెడ్డి హాజరై ప్రారంభించగా.. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రా రంభించారు. ఇక ఆయా కేంద్రాలలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్ర జాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని వ్యాక్సినేషన్‌ కా ర్యక్రమాన్ని నిర్వహించారు. టీకా తీసుకున్నవారిలో ఎవరికి కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని, అందరూ ఆరోగ్యంగానే ఉ న్నట్టు ఇరు జిల్లాల వైద్య ఆరోగ్యశాఖఅధికారులు తెలిపారు.

మొత్తం 358 మందికి వ్యాక్సినేషన్‌

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో తొలిరోజు కొవిడ్‌ టీకా ను మొత్తం 358 మంది తీసుకున్నారు. తొలి రోజు టీకాను వేసేందుకు నిజామాబాద్‌ జిల్లాలో 6, కామారెడ్డి జిల్లాలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆదేశించిన లక్ష్యం, నిబంధనల మేరకు ముందుగానే రెండు జిల్లాల వైద్య ఆరో గ్య శాఖ అధికారులు ఆయా కేంద్రాలలో టీకా తీసుకునే వా రి జాబితాను సిద్ధం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని 6 కేం ద్రాలలో 180 మందికి టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టు కు న్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళా శాల అనుబంధ ఆసుపత్రిలో 30 మందికి టీకా ఇచ్చారు. బోధన్‌ జిల్లా కేంద్ర ఆసుప త్రిలో 30 మందికి, ఆర్మూర్‌లో 30 మందికి, మాక్లూర్‌లో 30 మందికి, మోర్తాడ్‌లో 30 మందికి, డిచ్‌పల్లిలో 30 మందికి టీకాలు ఇ వ్వగా ఇందులో 15మంది అంగన్‌వాడీ కార్యక ర్తలు, 15 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. కా మారెడ్డి జిల్లాలోని నాలుగు కేంద్రాలలో 177 మ ందికి టీకాలు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసు పత్రిలో 46 మందికి ఇవ్వగా.. ఇందులో అంతా వైద్య సిబ్బందే ఉన్నారు. రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీలో 40 మందికి టీ కాలు ఇవ్వగా.. ఇందులో 12 మంది వైద్య సిబ్బంది, ఎనిమిది మంది ఆశ కార్యకర్తలు, 20 మంది అంగన్‌వాడీ కార్యకర్త లు ఉన్నారు. భిక్కనూరు పీహెచ్‌సీలో 32 మంది కి టీకాలు ఇవ్వగా.. ఇందులో 21 మంది వైద్య సిబ్బంది, 11 మంది ఆశ కార్యకర్తలు ఉన్నారు. సదాశినగర్‌ పీహెచ్‌సీలో 59 మందికి టీకాలు ఇవ్వగా ఇందులో 28 మంది వైద్య సిబ్బంది, 23 మంది ఆశ కార్యకర్తలు, ఎనిమిది మంది అంగన్‌వాడీ కార్య కర్తలు ఉన్నారు.

సదాశివనగర్‌లో అత్యధికంగా 59 మందికి

ఉమ్మడి జిల్లాలోని 10 కేంద్రాల్లో సదాశివనగర్‌ పీహెచ్‌ సీలో అత్యధికంగా 59 మంది టీకాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు ప్రభుత్వం నిర్ణయించిన అన్ని టీకా కేం ద్రాలలోని ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున కరోనా వారి యర్స్‌ అయిన వైద్యసిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకు కొవిడ్‌ టీకా అందించేందుకు నిర్ణయించింది. అన్ని కేంద్రాల్లో 30 మందికి టీకాలు ఇవ్వా లని లక్ష్యాన్ని  నిర్దేశించి వారి జాబితా  సిద్ధం చేసుకోవాలని ప్రభు త్వం ఆదేశించింది. కానీ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యా నికి మించి కేంద్రాలలో 40 మందికి పైగానే కరోనా టీకా లు తీసుకున్నారు. జిల్లాలోని కామారెడ్డి పట్టణంలో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో, రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీ, భిక్కనూరు, సదాశివనగర్‌ తో కలుపుకుని నాలుగు కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. అయితే కరోనా టీకాపై కొన్ని వర్గాల ప్రజల్లో అపోహలు ఉండడంతో టీకా తీసుకునేం దు కు వస్తారోలేదోనని ముందస్తు చర్యల్లో భాగంగా కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ జిల్లాలోని ఒక్కో కేంద్రంలో 30 నుంచి 100 మందిని ఎంపిక చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదే శించారు. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 50 మందికి టీకాలు ఇచ్చేందుకు జాబితాను తయారు చేయగా, రాజీవ్‌న గర్‌ పీహెచ్‌సీలో 50 మందికి, భిక్కనూరులో 45 మంది, సదాశివనగర్‌లో 70 మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జాబితాను సిద్ధం చేసింది. అయితే జిల్లా లోని నాలుగు కేంద్రాలలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి కొవిడ్‌ టీకాలు వేశారు. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసు పత్రిలో 46మందికి, రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీలో 40 మందికి, సదాశివనగర్‌ పీహెచ్‌సీలో 59 మందికి, భిక్కనూరు పీహెచ్‌ సీలో 32 మందికి టీకాలు వేశారు.

తొలి టీకా తీసుకుంది వీరే..

నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లి కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్త విజయ 10.15 నిమిషాలకు మొట్టమొదటి టీకా ను తీసుకున్నారు. నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రిలో శాని టేషన్‌ వర్కర్‌ అజయ్‌ తొలి టీకా తీసుకోగా, బోధన్‌లో ఆసు పత్రి సెక్యూరిటీ గార్డు రాజేందర్‌ 11.32 నిమిషాలకు టీకా తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సూప రింటెండెంట్‌ అజయ్‌కుమార్‌ 11.17 నిమిషాలకు, రాజీవ్‌నగ ర్‌ పీహెచ్‌సీలో సూపర్‌వైజర్‌ రమణ 11.10 నిమిషాలకు, భిక్కనూరు పీహెచ్‌సీలో ఆసుపత్రి వైద్యాధికారి శ్రీనివాస్‌ 11.17 నిమిషాలకు, సదాశివనగర్‌ పీ హెచ్‌సీలో సీహెచ్‌వో నాగరాజు 11.45 నిమిషాలకు తొలిటీకాను తీసుకున్నా రు. కాగా, సోమవారం కామారెడ్డి జిల్లాలో 29 కేంద్రాలలో టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఒక్కో కేం ద్రంలో 100 మందికి వ్యాక్సి నేషన్‌ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జాబితాను తయారు చేస్తున్నారు.

సురక్షితంగా వ్యాక్సినేషన్‌

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఫార్మా కంపెనీలు కొవిడ్‌ వ్యా క్సిన్‌ను అందు బాటులోకి తీసు కువచ్చాయి. మన దేశంలో భారత్‌ బయోటిక్‌ కంపెనీకి చెందిన కొవిషీల్డ్‌, కోవ్యాక్సిన్‌ను కరోనా నియంత్రణకు మార్కెట్లోకి తెచ్చారు. అయి తే ఈ వ్యాక్సిన్‌ను రెండు విడతలలో ప్రతీ ఒక్కరికి ఇవ్వను న్నారు. కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో కొన్ని అపోహలు నెలకొ న్నాయి. వ్యాక్సిన్‌ తీసుకుంటే అనారోగ్య కారణాలైన జ్వరం, ఒళ్లునొప్పులు, దురద లాంటివి వస్తాయోమోననే భయం ప్రజల్లో నెలకొంది. అయితే దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కరోనా టీకాను వైద్య సిబ్బందికి వేసి ప్రజలలో అ పోహలను తొలగించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మొదటి నుంచి తమ ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా అహర్నిశలు కృషిచేస్తున్న వైద్యసిబ్బంది టీకా వేయి ంచుకుని ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగిస్తూ వ్యాక్సినే షన్‌ సురక్షితమని భరోసా కల్పించారు. అయితే ఉమ్మడి జి ల్లాలో మొత్తం 358 మందికి టీకాలు తీసుకున్నారు. వీరిలో ఎవరికి కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలగలేదని, అందరూ ఆరోగ్యం గానే ఉన్నారని ఉభయ జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారు లు పేర్కొన్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితం.. అపోహలు వద్దు

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితమైనదని.. అపోహలు వద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివా రం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మంత్రి ప్రారంభి ంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొలి వ్యా క్సిన్‌ను శానిటరీ వర్కర్‌ అజయ్‌కు ఇచ్చారని, అతడు ఆరో గ్యంగా ఉన్నాడని తెలిపారు. ఎన్నో స్థాయిల్లో నిర్వహించిన పరిశోధనల్లో వ్యాక్సిన్‌ వంద శాతం సురక్షితమైనదని తేల్చి న తర్వాతనే ప్రజలకు అందించేందుకు ముందుకు రావడం జరిగిందని, ప్రజలెవరూ ఎలాంటి అపోహలకు తావివ్వవద్దన్నారు. పది నెలలుగా వ్యాక్సిన్‌ కోసం కృషిచేసిన శాస్త్రవేత్తలకు ప్రజల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞత లు తెలియజేస్తున్నామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మొ దటి విడతలో పార్ట్‌-ఏ కింద వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది, ఐసీడీఎస్‌ కార్యకర్తలు మొత్తం 15 వేల మందికి, పార్ట్‌-బీ కింద 8 వేల మంది పోలీసు, రెవెన్యూ సిబ్బందికి మొత్తం 23 వేల మందికి వ్యాక్సినైజేషన్‌ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం మొదటి రోజు జిల్లాలో ని 6 కేంద్రాల్లో ప్రతీ కేంద్రంలో 30 మంది చొప్పున వ్యాక్సిన్‌ వేశామని, 18వ తేదీ నుంచి జిల్లాలోని 42 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 4 ప్రైవేటు ఆసుపత్రులలో వ్యాక్సిన్‌ వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంఖ్యను పెంచుకుంటూ వెళుతూ ముందుముందు ఒ క్కో సెంటర్‌లో వంద మందికి వ్యాక్సిన్‌ వేసే విధంగా ఏర్పా ట్లు చేయడానికి అధికారులను ఆదేశించామన్నారు. అంత కు ముందు ప్రధానమంత్రి వ్యాక్సిన్‌కు సంబంధించి ఇచ్చిన సందేశాన్ని మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, రాజేశ్వర్‌, నుడా చైౖర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో సుదర్శనం, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ ఇందిర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:17:03+05:30 IST