వెలుగులోకి మరో కొత్త రోగం... ఇజ్రాయెల్‌లో తొలి కేసు...

ABN , First Publish Date - 2022-01-01T20:44:37+05:30 IST

రోగాల జాబితాలోకి కొత్తగా ఫ్లోరోనా చేరింది. కోవిడ్-19, ఫ్లూ

వెలుగులోకి మరో కొత్త రోగం... ఇజ్రాయెల్‌లో తొలి కేసు...

న్యూఢిల్లీ : రోగాల జాబితాలోకి కొత్తగా ఫ్లోరోనా  చేరింది. కోవిడ్-19, ఫ్లూ కలిసి సోకడాన్నే ఫ్లోరోనా అని పిలుస్తున్నారు. ఫ్లోరోనా తొలి కేసు ఇజ్రాయెల్‌లో నమోదైంది. ప్రసవం కోసం రబిన్ మెడికల్ సెంటర్‌కు వచ్చిన గర్భిణికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఆమెకు వ్యాక్సినేషన్ జరగలేదు. జాతీయ మీడియా శనివారం ఈ వివరాలను వెల్లడించింది. 


ఇజ్రాయెల్‌లో ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతుండటంతో ఫ్లోరోనాపై అధ్యయనాలు జరుగుతున్నాయని ఇజ్రాయెలీ వైద్యులు చెప్పారు. ఫ్లోరోనా అనేది కొత్త రూపాంతరం కాదని, ఫ్లూ, కరోనా ఏక కాలంలో సోకడాన్నే ఫ్లోరోనా అంటారని తెలిపారు. కైరో విశ్వవిద్యాలయం ఆసుపత్రి డాక్టర్ నహ్లా అబ్డెల్ వహబ్ ఇజ్రాయెలీ మీడియాతో మాట్లాడుతూ, రెండు వైరస్‌లు ఒకేసారి సోకడం వల్ల వ్యక్తిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందనే సంకేతాలు వచ్చినట్లు తెలిపారు. 


Updated Date - 2022-01-01T20:44:37+05:30 IST