Srinagar: 145 మందితో బయలుదేరిన Hajj-2022 తొలి విమానం

ABN , First Publish Date - 2022-06-05T22:57:09+05:30 IST

హజ్ యాత్ర మొదలైంది. హజ్-2022 తొలి విమానం శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారంనాడు సౌదీ అరేబియాకు..

Srinagar: 145 మందితో బయలుదేరిన Hajj-2022 తొలి విమానం

శ్రీనగర్: హజ్ యాత్ర మొదలైంది. హజ్-2022 తొలి విమానం శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారంనాడు సౌదీ అరేబియాకు బయలుదేరింది. 145 మంది యాత్రికులు ఇందులో ప్రయాణించారు. ఏటా జరిగే ఈ హజ్ యాత్ర గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా రద్దయింది.


కాగా, హజ్-2022 సీజన్‌లో 145 మంది యాత్రికులతో కూడిన తొలి విమానం శ్రీనగర్ నుంచి మదీనాకు ఉదయం బయలుదేరినట్టు అధికారులు తెలిపారు. జూన్ 20 వరకూ మొత్తం 5,737 మంది హజ్ విమానాల్లో సౌదీ అరేబియా వెళ్తారు. ఈనెల 12న రెండు హజ్ విమానాలు నడుస్తాయని, 13 నుంచి ప్రతిరోజూ 3 హజ్ విమానాలు శ్రీనగర్ నుంచి మదీనా వెళ్తాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. కాగా, హజ్ యాత్ర ప్రారంభం సందర్భంగా విమానాశ్రయానికి విచ్చేసిన వారిలో లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు ఆర్ఆర్ భట్నాగర్, ఎల్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నితేశ్వర్ శర్మ, జమ్మూ డివిజనల్ కమిషనర్ కేకే పోల్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.

Updated Date - 2022-06-05T22:57:09+05:30 IST