ఓపెన్‌ స్కూల్‌ పది పరీక్షల్లో జిల్లా ఫస్ట్‌

ABN , First Publish Date - 2022-06-25T06:53:20+05:30 IST

ఓపెన్‌ స్కూల్‌ పది పరీక్షల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానం సాధించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం శుక్రవారం తెలిపారు.

ఓపెన్‌ స్కూల్‌ పది పరీక్షల్లో జిల్లా ఫస్ట్‌

చిత్తూరు సిటీ, జూన్‌ 24:  ఓపెన్‌ స్కూల్‌ పది పరీక్షల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానం సాధించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించిన ఓపెన్‌ స్కూల్‌ పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి, ఓపెన్‌స్కూల్‌ డైరెక్టర్‌ అమరావతిలో విడుదల చేసినట్లు చెప్పారు. అందులో జిల్లా నుంచి పదవ తరగతి పరీక్షలకు 3095 మంది హాజరుకాగా, 2616 మంది (84.52 శాతం) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 3996 మంది హాజరుకాగా, 2921 మంది (73.10 శాతం) ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఇంటర్‌ ఫలితాల్లో  రాష్ట్రంలో జిల్లా నాల్గవ స్థానంలో నిలిచిందన్నారు. ఓపెన్‌ స్కూల్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజును ఈనెల 27 నుంచి వచ్చే నెల 1వ తేదీలోపు చెల్లించాలని ఆయన తెలిపారు.

Updated Date - 2022-06-25T06:53:20+05:30 IST