వైద్యులు ముందుండి టీకా వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-01-24T04:41:22+05:30 IST

వైద్యులు ముందుండి కరోనా టీకా వేయించుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

వైద్యులు ముందుండి టీకా వేయించుకోవాలి

 ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకుల సమీక్షలో జేసీ

నెల్లూరు(వైద్యం) జనవరి 23 : వైద్యులు ముందుండి కరోనా టీకా వేయించుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి  తెలిపారు. నుడా కార్యాలయంలో శనివారం ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకుల తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి టీకా త్వరితగతిన వేయాలని సూచించారు. మొదటి విడత కరోనా  వ్యాక్సిన్‌ను వైద్యులు, సిబ్బందికి వేయాలని నిర్ణయించామన్నారు. దాని దృష్ట్యా ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఎంతో సురక్షితమైందని, ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని వెల్లడించారు. మొదటి విడత పూర్తయిన వెంటనే రెండో విడత టీకా ప్రారంభిస్తామని వెల్లడించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డాక్టర్‌ సెలీనాకుమారి, నారాయణ, కిమ్స్‌, అపోలో, డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల తదితర ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T04:41:22+05:30 IST