మూడు విమానాల్లో ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి రానున్న భారతీయులు

ABN , First Publish Date - 2022-02-22T14:57:54+05:30 IST

ఉక్రెయిన్ దేశంలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను మంగళవారం స్వదేశానికి తీసుకురానున్నారు....

మూడు విమానాల్లో ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి రానున్న భారతీయులు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ దేశంలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను మంగళవారం స్వదేశానికి తీసుకురానున్నారు. ఉక్రెయిన్ నుంచి మూడు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాల్లో భారతీయ విద్యార్థినులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. భారత విద్యార్థులతో కూడిన మొదటి విమానం మంగళవారం ఢిల్లీకి చేరుకుంది.ఉక్రెయిన్ దేశంలో 20వేలమంది కంటే ఎక్కువమంది భారత పౌరులు చదువుకుంటున్నారు. భారత విద్యార్థుల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి చెప్పారు. దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాుడుకోవాలని తిరుమూర్తి కోరారు.


 రష్యా - ఉక్రెయిన్ మధ్య పరిస్థితి తీవ్రంగా మారడంతో భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.రాయబార కార్యాలయ సిబ్బంది సహా ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను తరలించే ప్రక్రియ మొదలు పెట్టింది. కేంద్రం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల్లో భారతీయులను తరలించనున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే భారతీయుల విమానం ఉదయం 10.30గంటలకు ఢిల్లీ చేరుకోనుందని విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు.


Updated Date - 2022-02-22T14:57:54+05:30 IST